- నిర్వహణ నిధులతో కొత్త చిక్కులు
- తలలు పట్టుకుంటున్న పోలీసులు
- వాటాలు డబుల్..!
కరీంనగర్ క్రైం : ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన ఠాణాల నిర్వహణ నగదు ఖాకీల మధ్య కాసుల లొల్లికి తెరలేపింది. ప్రభుత్వం ఇస్తున్న మొత్తంలో తమ వాటా పంపాలని ఉన్నతాధికారుల హుకుంతో మండలాల్లోని ఎస్సైలు బెంబేలెత్తుతున్నారు. ఇటు ఠాణాను మెరుుంటేన్ చేయలేక.. అటు ఉన్నతాధికారులకు వాటాలు పంపిణీ చేయలేక తలలు పట్టుకుంటున్నారు. మాట వినని అధికారులను మెమోల పేరిటా వారి దారిలోకి తెచ్చుకుంటున్నట్లు తెలిసింది. గతంలో ప్రభుత్వం ఇచ్చే మూడు, నాలుగు వేలతో ఠాణా నిర్వహణకు ఇబ్బందులు పడేవారు. దీంతో ప్రతి పోలీస్‌స్టేషన్ రోజు వ్యవహారాల కోసం మూముళ్లు వసూలు చేసేవారు. ఇవి ఠాణాకు ఇంత అని ఉండేది. ఇలా వ చ్చిన మూముళ్లను నెలవారీ ఠాణా నిర్వహణకు పోను మిగిలిన వాటిలో సర్కిల్, డీఎస్పీ కార్యాలయాల నిర్వహణకు వెచ్చించేవారు.
ఈ వ్యవస్థ కొన్ని దశాబ్దాలుగా నడుస్తూనే ఉంది. వీటికి పోను చిన్నపాటి పనులకు స్టేషన్‌కు వచ్చే వారి నుంచి కొంత మొత్తంలో మామూళ్లు వసూలు చేస్తున్నారనే ఆరోపణలున్నారుు. ఆరోపణలను రూపుమాపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఠాణాల నెలవారీ నిర్వహణ ఖర్చులు ఇచ్చేందుకు నిర్ణరుుంచింది. నగర ఠాణాలకు రూ.50 వేలు, రూరల్, మండల ఠాణాలకు రూ.25 వేల చొప్పున ఇస్తోంది. మొదటి మూడు నెలల డబ్బులు ఒకేసారి ఆయా ఠాణాల బ్యాంక్ ఖాతాల్లో జమ చేసింది.
ఒక్కసారిగా అంత డబ్బు రావడంతో పై నుంచి కింది స్థాయి సిబ్బంది వరకూ వాటి కోసం ఆశపడ్డారు. దీంతో అయా ఠాణా ఎస్‌హెచ్‌వోలకు కొత్త చిక్కులు మొదలయ్యూరుు. పాత లెక్క ప్రకారం పాత మామూళ్ల పంపకంతోపాటు కొత్తగా ప్రభుత్వం ఇస్తున్న వాటిలోనూ వాటాలు పంపాలని హుకుం జారీ చేస్తున్నారని.. వినని వారిపై అధికారాన్ని వినియోగించి ఇబ్బందులు గురి చేస్తున్నారని తెలిసింది. దీంతో కక్కలేక మింగలేక ఎస్‌హెచ్‌వోలు తలలు పట్టుకుంటున్నారని సమాచారం.
ఓ సబ్ డివిజన్‌లోని ఓ ఠాణాకు మూడు నెలలకు రూ.75 వేలు రావడంతో ఆయా ఎస్‌హెచ్‌వో వాటిని స్టేషన్‌కు అవసరమైన సరంజామా కొనుగోలు చేద్దామని అనుకుని పై అధికారులకు విన్నవించాడు. సరంజామా విషయం పక్కన పెట్టి వచ్చిన డబ్బులో సర్కిల్ ఒక నెల, డీఎస్పీ కార్యాలయానికి ఒక నెల ఇవ్వాలని హుకుం జారీ చేశారు. ఖంగుతిన్న సదరు ఎస్సై అత్యవసరంగా స్టేషన్‌ను బాగు చేరుుంచాలని విన్నవించినా వారు ససేమిరా అన్నారు. మిన్నకుండిపోయిన ఎస్సై డబ్బును అలాగే ఉంచడంతోపాటు పాత బకాయిలు చెల్లించాలని అనుకున్నాడు. పంపకాలు రాకపోయే సరికి ఇది గిట్టని సదరు సబ్‌డివిజన్ అధికారి స్టేషన్ నిర్వహణ చేయడం లేదని ఏకంగా మెమో ఇచ్చినట్లు తెలిసింది.
- మరో సబ్ డివిజన్‌లో ఓ డీఎస్పీ నెలవారీ మూముళ్లకు కొత్త పద్ధతికి తెరలేపారని సమాచారం. గతంలో లాగా నడుస్తున్న విధానంలో మామూళ్లు ఇవ్వడంతోపాటు ప్రతి ఠాణా ఎస్సై, సీఐ అదనంగా రూ.10 వేలు పంపాలని నిర్ణయించిన ట్లు తెలిసింది. ఐదారు నెలలుగా వారు ఇబ్బందులు పడుతూనే వాటిని ఏర్పాటు చేస్తున్నారని సమాచారం. ఇవ్వకుంటే వారు న మోదు చేస్తున్న కేసుల విషయంలో వేలుపెడుతూ మెమోలు ఇస్తున్నారని తెలిసింది.
- మరో సబ్ డివిజన్‌లో డీఎస్పీ పాత పద్ధతి ప్రకారం నెలవారీ మామూళ్లతోపాటు ప్రభుత్వం ఇస్తున్న వాటిలో వాటాలు, అదనంగా కేసుల్లో వచ్చే మామూళ్ల నుంచి వాటాలు పంపించాలని సూచిస్తున్నారని పలువురు అధికారులు వాపోతున్నారు.
నలిగిపోతున్న ఎస్సైలు
తాజా బదిలీల్లో కొత్త నేతల సిఫారసు తెరపైకి రావడంతో పలువురు ఎస్సైలు పోస్టింగ్‌ల కోసం ఆయూ నాయకులను ప్రసన్నం చేసుకున్నట్లు సమాచారం. ప్రసన్నం చేసుకునే క్రమంలో అధికారులు అప్పులు చేసి పోస్టింగ్‌లు దక్కించుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. పై అధికారుల వైఖరితో ఎందుకు పోస్టింగ్‌కు వచ్చామా? అని సన్నిహితుల వద్ద వాపోతున్నట్లు తెలిసింది. అంతేకాకుండా ఉన్నతాధికారులు చాలా రోజులుగా జిల్లాలో పనిచేయడంతో నాయకులతో ఉన్న సన్నిహిత సంబంధాలతో నేరుగా కేసులను డీల్ చేస్తున్నారని.. రాబడి సైతం తగ్గిందని ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం.
మారని తీరు
రాష్ట్రంలోని పోలీస్‌శాఖకు గతంలో ఎన్నడూ లేని విధంగా పలు రకాల సౌకర్యాలు కల్పించింది ప్రభుత్వం. ప్రతి ఠాణాకు వాహనాలు సమకూర్చడంతోపాటు డీజిల్ నిర్వహణ ఖర్చులు ఇస్తోంది. ఠాణా నిర్వహణకు నిధులు మంజూరు చేస్తున్నా పరిస్థితిలో మార్పురాకపోవడం లేదని జనం చర్చించుకుంటున్నారు. కొత్తగా ప్రభుత్వం ఇస్తున నిర్వహణ నగదు వాటి వాటాల మొత్తం పెంచిందనే విమర్శలు వస్తున్నారుు. ఉన్నతాధికారులు స్పందించి మార్పు కోసం ప్రయత్నించాలని కోరుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి పరిస్థితిలో మార్పు తీసుకురావాలని కోరుతున్నారు.
ఖాకీల కాసుల లొల్లి
Published Wed, Apr 15 2015 12:46 AM | Last Updated on Sun, Sep 2 2018 3:42 PM
Advertisement