డీఎండబ్ల్యూవోల డిప్యుటేషన్ పొడిగింపు | DMWO officers deputation extension | Sakshi
Sakshi News home page

డీఎండబ్ల్యూవోల డిప్యుటేషన్ పొడిగింపు

Published Thu, Apr 23 2015 1:52 AM | Last Updated on Sun, Sep 3 2017 12:41 AM

DMWO officers deputation extension

సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మైనార్టీ సంక్షేమశాఖలో పనిచేస్తున్న ఏడుగురు జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖాధికారులు(డీఎండబ్ల్యూవో)కు మరో ఏడాదిపాటు డిప్యుటేషన్‌ను పొడిగిస్తూ రెవెన్యూ శాఖ ప్రిన్సిపాల్ కార్యదర్శి బీఆర్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు. రెవెన్యూ శాఖకు చెందిన డిప్యూటీ కలెక్టర్లను గతేడాది ఏడాది కాలం కోసం డిప్యుటేషన్‌పై మైనార్టీ సంక్షేమ శాఖకు కేటాయించారు. ప్రస్తుతం డీఎండబ్ల్యూవోలుగా పనిచేస్తున్న ఆర్.కుముదిని(ఖమ్మం), ఎస్.శిరీషా(మహబూబ్‌నగర్), శ్రీరాములు(నల్లగొండ), చంద్రశేఖర్(నిజామాబాద్), భాగ్యమ్మ(వరంగల్), కె.లక్ష్మీకిరణ్(ఏపీఎంఎఫ్‌సీ), బి.హరిప్రియ (ఏపీ వక్ఫ్‌బోర్డు లీగల్ ఓఎస్‌డీ)ల డిప్యుటేషన్ గడువు ముగిసింది. దీంతో మరో ఏడాదిపాటు పొడిగిస్తూ తాజాగా ఆదేశాలు జారీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement