శివయ్య చెప్పినా..శివలింగం చిక్కలేదు | Dug to a depth of 20 feet in Janagama | Sakshi
Sakshi News home page

శివయ్య చెప్పినా..శివలింగం చిక్కలేదు

Published Tue, Jun 6 2017 1:40 AM | Last Updated on Tue, Sep 5 2017 12:53 PM

శివయ్య చెప్పినా..శివలింగం చిక్కలేదు

శివయ్య చెప్పినా..శివలింగం చిక్కలేదు

కలలో శివుడు కన్పించాడంటూ    ఓ భక్తుడి హంగామా
హైవే వద్ద గ్రామస్తుల తవ్వకాలు


సాక్షి, జనగామ: ఓ శివభక్తుడు గ్రామస్తులను పరుగులు పెట్టించాడు. శివయ్య తనకు కలలో కనిపించి శివలింగాన్ని బయటకు తీయాలంటున్నాడ ని చెప్పడంతో స్థానికులు తవ్వకాలు చేపట్టారు. ఎంత తవ్వినా శివలింగం కనిపించలేదు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సదరు శివభక్తుడితో పాటు పలువురిని అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. జనగామ పట్టణానికి చెందిన మాంసం వ్యాపారి ఎల్‌.మనోజ్‌ అలియాస్‌ మణి గత ఐదేళ్లుగా శివమాల ధరించి పూజలు చేస్తున్నాడు.

 పెంబర్తి గ్రామ శివారులోని జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న టంగుటూరు క్రాస్‌రోడ్డు వద్ద శివలింగం ఉందని, గత మూడేళ్లుగా శివుడు తన కలలో దర్శన మిస్తూ.. బయటకు తీయాలని వేడుకుంటున్నాడని పెంబర్తి గ్రామ ప్రజాప్రతినిధులకు, గ్రామస్తులకు చెప్పుకుంటూ వస్తున్నాడు. ఈ విషయాన్ని ఎవరూ పట్టించుకోకపోవడంతో మనోజ్‌ ప్రతి సోమవారం శివలింగం ఉందని భావించిన ప్రదేశంలో పూజలు నిర్వహిస్తున్నాడు.

 ఇదే క్రమంలో గ్రామ ప్రజాప్రతిని ధులను కలిసిన మనోజ్‌ శివలింగం విషయాన్ని గుర్తుచేయడంతో సోమవారం పూజలు నిర్వహించిన స్థలంలో జేసీబీ సహాయంతో 20 అడుగుల లోతు తవ్వారు. అయినా శివలింగం కనిపించలేదు. తవ్వకా ల సమాచారాన్ని అందుకున్న పోలీసులు మనోజ్‌తోపాటు  సర్పంచ్‌ సిద్ధిలింగం, ఎంపీటీసీ సభ్యురాలి భర్త కిషన్, కాంగ్రెస్‌ నాయకుడు ధర్మపురి శ్రీనివాస్, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ నాగారపు వెంక ట్‌లను అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు.

ఓం నమశివాయ నామస్మరణతో మార్మోగిన ప్రదేశం
తవ్వకాలు జరుపుతున్న క్రమంలో ఓం నమశివాయ అంటూ శివనామ çస్మరణతో ఆ ప్రాంతం మార్మోగిం ది. జేసీబీతో తవ్వకాలకు ముందు భక్తుడు మనోజ్‌  పూజలు నిర్వహించాడు. ఈ క్రమంలో ఆయనకు పూనకం రావడంతో ప్రజలు,  పులకించిపోయారు. కానీ, 20 అడుగులు తవ్వినా ఫలితం కానరాకపో వడంతో వెనుదిరిగారు.ఈ క్రమం లో హైదరాబాద్‌ – జనగామ జాతీయ రహదారిపై ట్రాఫిక్‌కు అంతరా యం కలిగింది. దీంతో పోలీసులు సంఘటన స్ధలాని కి చేరుకొని స్థానికులను అక్కడి నుండి వెళ్లిపోవాలని సూచించారు. సంఘటన స్ధలాన్ని జనగామ డీసీపీ వెంకన్న, ఏసీపీ పద్మనాభరెడ్డి, సీఐ శ్రీనివాస్‌ చేరుకొ ని గుంతను పూడ్చివేశారు. ప్రజలు మూఢన మ్మకాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement