
సాక్షి, హైదరాబాద్: అక్రమ నిర్మాణాల తొలగింపునకు ‘ఈ-నోటీస్’ ఇస్తున్నామని జీహెచ్‌ఎంసీ విజిలెన్స్ అండ్ డిజాస్టర్ డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి తెలిపారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ..ఈ విధానంలో పారదర్శకత కనిపిస్తుందని వెల్లడించారు. సిస్టం ద్వారానే ప్రక్రియ అంతా జరుగుతుందని.. ప్రతీ నోటీస్‌కు క్యూఆర్ కోడ్ ఉంటుందని పేర్కొన్నారు. దీంతో అన్ని వివరాలు ప్రజలకు తెలుస్తాయని వివరించారు. అక్టోబర్ నుంచి ఈ పద్ధతి ఉపయోగిస్తున్నామని వెల్లడించారు. మాన్యువల్ పద్ధతి ఇక్కడ ఉండదని.. లొకేషన్ పూర్తి వివరాలతో పాటు భద్రతాపరమైన అంశాలు ఉంటాయని పేర్కొన్నారు. కోర్టుకి ఎవరైనా వెళ్ళినా ఇది పూర్తిస్థాయి ఆధారంగా ఉపయోగపడుతుందని తెలిపారు. ఇప్పటి వరకు 4,61,783 అక్రమ బ్యానర్లు, వాల్‌పోస్టర్స్, గోడ రాతలు, భవన నిర్మాణ వ్యర్థాలు తొలగించామని వెల్లడించారు. 136 కి.మీల పరిధిలో ఫుట్‌పాత్ అక్రమ నిర్మాణాలు తొలగించామని విశ్వజిత్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment