తెలంగాణ ఉన్నత విద్యా మండలి నేతృత్వంలో మే 3న ఎంసెట్ నిర్వహించే అవకాశం ఉంది.
* తెలంగాణ ఉన్నత విద్యా మండలి నిర్ణయం!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉన్నత విద్యా మండలి నేతృత్వంలో మే 3న ఎంసెట్ నిర్వహించే అవకాశం ఉంది. ఈ మేరకు తెలంగాణ ఉన్నత విద్యా మండలి నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. వివిధ విశ్వవిద్యాలయాల వైస్ చాన్స్‌లర్లు, హైదరాబాద్ జేఎన్‌టీయూ అధికారులతో ఉన్నత విద్యా మండలి అధికారులు మంగళవారం చర్చించారు.
ఎంసెట్ మే 10న నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రకటించిన నేపథ్యంలో... 15 శాతం ఓపెన్ కోటాలో ప్రవేశాల కోసం తెలంగాణ ఎంసెట్‌ను రాయాలనుకునే ఏపీ విద్యార్థులకు సౌకర్యంగా ఉండేలా ఈ తేదీని ఖరారు చేసినట్లు తెలిసింది. ఒకవేళ మే 3న సాధ్యం కాని పరిస్థితులు ఉంటే మే 17న ఎంసెట్ నిర్వహించాలని భావిస్తున్నారు. ఎంసెట్ నిర్వహణ, ఇతర ప్రవేశ పరీక్షల తేదీలను రెండు మూడు రోజుల్లో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.