తెలంగాణలో విజృంభిస్తున్న కరోనా | Eatala Rajender Press meet on Coronavirus situation in Telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు

Published Thu, Apr 16 2020 7:13 PM | Last Updated on Thu, Apr 16 2020 7:27 PM

Eatala Rajender Press meet on Coronavirus situation in Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గురువారం ఒక్కరోజే 50 పాజిటివ్‌ కేసులు నమోదు అయినట్లు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. ఇవాళ్టి కొత్త కేసులన్ని గ్రేటర్ పరిధిలోనే నమోదు అయినట్లు చెప్పారు. ఇప్పటివరకూ తెలంగాణ 700 కేసులు నమోదు కాగా, 18మంది మృతి చెందినట్లు మంత్రి ఈటెల తెలిపారు. ఇప్పటివరకూ కరోనా బారిన పడి కోలుకుని 186మంది డిశ్చార్జ్‌ అయ్యారని పేర్కొన్నారు. ఇవాళ 68మంది డిశ్చార్జ్‌ కాగా, ఎవరూ చనిపోలేదన్నారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోయినా లాక్‌డౌన్‌పై మొదట ప్రకటన చేసింది తెలంగాణయేనని అన్నారు. పేదలను ఆదుకోవాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉద్దేశ్యమని, ప్రతిపక్షాలు విమర్శలు చేయడం సరికాదని అన్నారు. (కరోనా కట్టడికి ఇదే మార్గం! భౌతిక దూరం అంటే ఇదీ!)

కోఠిలోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో మంత్రి ఈటెల మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘పాజిటివ్‌ కేసులు పెరిగినా, తగ్గినా ఆందోళన అవసరం లేదు. అందరి ఆరోగ్యం బాగానే ఉంది. రాష్ట్రంలోని అన్ని ల్యాబ్‌ల్లో నిరంతరాయంగా పరీక్షలు జరుగుతున్నాయి. ఎన్ని కేసులు వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. 10 లక్షల పీపీఈ కిట్లు, ఎన్‌-95 మాస్కులు అందుబాటులో ఉన్నాయి. చిన్న పిల్లల కోసం గాంధీ ఆస్పత్రిలో స్పెషల్‌ వార్డును సిద్ధం చేశాం. ఈ నెల 20న గచ్చిబౌలిలో ఆస్పత్రిని ప్రారంభిస్తాం. ఆ ఆస్పత్రిని 1500 పడకల స్థాయికి తీర్చిదిద్దుతాం. (కోవిడ్-19: ఇలా చేస్తే కరోనా రాదు!)

ప్రజలు తప్పనిసరిగా భౌతిక దూరం పాటించాలి. బ్యాంకుల దగ్గర జనాలు గుంపులు గుంపులుగా ఉంటున్నారు. మీ అకౌంట్‌లో పడిన డబ్బులు ఎక్కడికీ పోవు. రోజు కొంతమందికి డబ్బులు ఇస్తారు. ప్రజలు సంయమనం పాటించాలి. ప్రతి ఒక్కరూ అధికారులకు సహకరించాలి. అయితే కొంతమంది సహకరించడం లేదు. అలాగే మర్కజ్‌ నుంచి వచ్చినవారు,  వారిని కలిసిన వారు స్వచ్ఛందంగా పరీక్షలు చేయించుకోవాలి’ అని విజ్ఞప్తి చేశారు. (నిన్న డీమార్ట్.... ఇవాళ రత్నదీప్)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement