పీవీఆర్‌కే ప్రసాద్‌ చిత్రపటం ఆవిష్కరణ | Eatala unveils the portrait of Late PVRK Prasad | Sakshi
Sakshi News home page

పీవీఆర్‌కే ప్రసాద్‌ చిత్రపటం ఆవిష్కరణ

Published Thu, Oct 19 2017 4:59 AM | Last Updated on Mon, Mar 25 2019 3:09 PM

Eatala unveils the portrait of Late PVRK Prasad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ(ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ)లో మాజీ ఐఏఎస్‌ అధికారి పీవీఆర్‌కే ప్రసాద్‌ చిత్రపటాన్ని బుధవారం ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ డైరెక్టర్‌ జనరల్‌గా పీవీఆర్‌కే ప్రసాద్‌ అనేక కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు.

ముఖ్యంగా మౌలిక వసతుల కల్పన, శిక్షణ వ్యవస్థను పటిష్టం చేశారని కొనియాడారు. ఈ ఏడాది ఆగస్టులో మరణించిన పీవీఆర్‌కే ప్రసాద్‌ 1998 నుంచి 2004 మధ్య ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ డైరెక్టర్‌ జనరల్‌గా పనిచేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement