రూ.50వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన ఏఈ సురేందర్
భద్రకాళి పనుల ప్రతిపాదనల పెంపునకు డబ్బు డిమాండ్
కలెక్టర్ ఆదేశించినా పట్టువదలని అధికారి
విసిగిపోరుు ఏసీబీని ఆశ్రయించిన కాంట్రాక్టర్
వరంగల్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మిషన్ కాకతీయ పనుల్లో అవినీతి చోటుచేసుకుంటుందన్న ఆరోపణలకు బలం చేకూర్చే ఘటన ఇది. వరంగల్‌లోని భద్రకాళి చెరువు మరమ్మతుల్లో భాగంగా అంచనాలు పెంచేందుకు ఏఈ ఒకరు కాంట్రాక్టర్ నుంచి లంచం డిమాండ్ చేయగా.. విసిగిపోరుున ఆయన ఏసీబీని ఆశ్రరుుంచారు. దీంతో మంగళవారం సదరు ఏఈ డబ్బు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
రివైజ్డ్ ఎస్టిమేట్ల కోసం...
వరంగల్ నగర ప్రజల దాహార్తి తీరుస్తున్న భద్రకాళి చెరువులో పూడికతీత కోసం ప్రభుత్వం మిషన్ కాకతీయ కింద రూ.4.05కోట్లు మంజూరు చేసింది. ఈ పనులను హర్ష కన్‌స్ట్రక్షన్ కంపెనీ దక్కించుకోగా, సబ్ కాంట్రాక్టర్‌గా ప్రకాష్‌రెడ్డి తీసుకున్నట్లు తెలిసింది. చెరువులోని పూడికతీత ద్వారా వచ్చిన మట్టితో బండ్‌ను పట్టిష్టం చేయాల్సి ఉంది. అరుుతే, పూడిక తీయూలంటే చెరువులోని నీటిని ఖాళీ చేయూల్సి వస్తోంది. ఇదే జరిగితే నగరానికి తాగునీటికి ఇబ్బంది ఎదురవుతుందని నగర పాలక సంస్థ అధికారులు కలెక్టర్‌కు వివరించారు. ఈ విషయమై నిపుణులతో చర్చించిన కలెక్టర్ పూడికతీత కష్టమని నిర్ధారణకు వచ్చారు. ఈ మేరకు మొదట మంజూరైన నిధులతో బండ్‌ను పటిష్టం చేసే పనులు చేపట్టాలని మైనర్ ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. అరుుతే, అప్పటికే చెరువుకట్టలో కొంత భాగం పట్టిష్టం చేసినట్లు అధికారుల లెక్కలు చెబుతుండగా, ఈ పనులకు సుమారు రూ.70లక్షలు చెల్లించారు. మిగిలిన నిధులతో పను లు పూర్తి చేసేందుకు రివైజ్డ్ ఎస్టిమేట్లు చేయాలని ఏఈ సురేందర్‌రావును సంబంధిత కాంట్రాక్టర్ కోరారు. రూ.లక్ష ఇస్తేనే చేస్తానని సురేందర్‌రావు చెప్పగా... మూడు, నెలలుగా ఈ వ్యవహారంపై చర్చలు సాగుతున్నారుు. చివరకు నాలుగు రోజుల క్రితం రూ.50వేలు ఇచ్చేలా కాంట్రాక్టర్-ఏఈ నడు మ ఒప్పందం కుదిరినట్లు తెలిసింది. ఈ మేరకు మంగళవారం సాయంత్రం రూ.50వేలను ఏఈ సురేందర్‌రావుకు కాంట్రాక్టర్ ప్రకాశ్‌రెడ్డి వరంగల్‌లోని మైనర్ ఇరిగేషన్ సబ్‌డివిజన్ కార్యాలయంలో ఇస్తుండగా ఏసీబీ అధికారులు వల పన్ని పట్టుకున్నారు. ఏసీబీ దాడులు మైనర్ ఇరిగేన్ శాఖలో కలక లం రూపగా.. మిషన్ కాకతీయ పనుల్లో అధికారుల అవినీతికి నిదర్శమని కాంట్రాక్టర్లు చెబుతున్నారు.
‘మిషన్’లో అవినీతి చేప
Published Wed, Dec 2 2015 1:28 AM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM
Advertisement
Advertisement