
గడ్డి మోపు.. ప్రచారానికి ఊపు
మిరుదొడ్డి(దుబ్బాక): టీఆర్‌ఎస్ నాయకలు మండల పరిధిలోని ధర్మారంలో మంగళవారం వ్యవసాయ పొలాల్లో పనులు చేసుకుంటున్న రైతుల వద్దకు వెళ్లి కారు గుర్తుకు ఓటు వేసి దుబ్బాక టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సోలిపేట రామలింగారెడ్డిని గెలిపించాలని కోరుతూ ఓటర్లను అభ్యర్థించారు. వరి మోపులు మోస్తూ ఎన్నికల ప్రచారం చేశారు.
కమల ‘వికాసం’
మెదక్‌అర్బన్: మెదక్‌పట్టణంలో మంగళవారం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో కార్యకర్తలు వినూత్నంగా ప్రచారం చేపట్టారు. బీజేపీ పార్టీ గుర్తు కమలం పువ్వు కటౌట్ చేతబూని, కమలం గుర్తుకు ఓటు వేయాలనే ప్లకార్డు నడుముకు ధరించారు. సభకు వచ్చిన నాయకులు, కార్యకర్తలు ఈ వినూత్న ప్రచారాన్ని చూçస్తూ ఆనందపడ్డారు.
లెఫ్ట్.. రైట్ ప్రచారం
అల్లాదుర్గం(మెదక్): అందోల్ టీఆర్‌ఎస్ అభ్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి వాహనాలు మంగళవారం అల్లాదుర్గం వారంతపు సంత వద్ద ప్రచారం నిర్వహించాయి. ఈ ప్రచారం రాత్రి 7 గంటల వరకు సాగింది. వాహనాలు పక్కపక్కనే ఉండటంతో సంతకు వచ్చినవారు ఆసక్తిగా తిలకించారు.
లక్షే..లక్ష్యం..
సిద్దిపేటజోన్: సిద్దిపేట శాసనసభకు పోటీచేస్తున్న టీఆర్‌ఎస్ అభ్యర్థి హరీశ్‌రావుకు లక్ష మెజార్టీ లక్ష్యంగా యువకులు లైటింగ్‌బోర్డ్‌లతో పట్టణంలో మంగళవారం రాత్రి వినూత్నంగా ప్రచారం చేశారు. జిగేల్‌మని మెరిసే విద్యుత్‌దీపాల అలంకరణలో ప్రచారం పలువురిని ఆకట్టుకుంటుంది.
Comments
Please login to add a commentAdd a comment