ఆదిలాబాద్ జిల్లా వాంకిడి మండలం సామెల గ్రామంలో విద్యుద్ఘాతంతో ఒకరు చనిపోయారు.
వాంకిడి (ఆదిలాబాద్) : ఆదిలాబాద్ జిల్లా వాంకిడి మండలం సామెల గ్రామంలో విద్యుద్ఘాతంతో ఒకరు చనిపోయారు. వివరాల్లోకి వెళ్తే.. సామెల గ్రామానికి చెందిన రేగుంట కిష్టయ్య(30) ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తున్నాడు. కాగా సోమవారం రాత్రి గాలి దుమారానికి తీగలు తెగిపడి విద్యుత్ అంతరాయం ఏర్పడింది. దీంతో కిష్టయ్య మరో హెల్పర్‌తో కలసి మంగళవారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో 11కేవీ విద్యుత్ స్తంభం వద్దకు వెళ్లాడు. లైన్ క్లియరెన్స్ కోసం వారు అధికారులకు ఫోన్ చేశారు. అయితే క్లియరెన్స్ వచ్చీరాకమునుపే కిష్టయ్య కరెంట్ స్తంభం ఎక్కి మరమ్మతు చేయబోయాడు. విద్యుత్ ప్రసారం కావటంతో షాక్‌కు గురై స్తంభం పైనుంచి కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు.