బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్
హాలియా (నాగార్జుసాగర్) : తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ పాలన అంతం బీజేపీతోనే సాధ్యమవుతుందని.. ప్రజాస్వామిక తెలంగాణ ఏర్పాటు కోసం 2019లో తాము అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రచారంలో భాగంగా నిర్వహిస్తున్న ఇంటింటికీ బీజేపీ కార్యక్రమంలో పాల్గొనేందుకు బుధవారం ఆయన హాలియాకు వచ్చారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో లక్ష్మణ్ మాట్లాడుతూ రాష్ట్రంలో సామాజిక పరిస్థితులను బీజేపీ పూర్తిగా అధ్యయనం చేసిందని, ప్రజాస్వామిక వాదులందరూ ‘కమలం’ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని పేర్కొన్నారు. మూడేళ్లుగా రాష్ట్రంలో అభివృద్ధి చేతుల మీదే తప్ప.. ఆచరణలో లేదని విమర్శించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు నూకల నర్సింహ్మారెడ్డి, రాష్ట్ర కార్యరద్శి కంకణాల శ్రీధర్‌రెడ్డి, చెన్ను వెంకటనారాయణరెడ్డి, జితేందర్‌రెడ్డి, కొమ్మనబోయిన చంద్రశేఖర్, బెజవాడ శేఖర్, మిట్టపల్లి శ్రీనివాస్, నక్క వెంకటేశం,ఎల్లారెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, సైదాచారి, అశోక్, నర్సింహ్మారెడ్డి, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కుటుంబ పాలన అంతం బీజేపీతోనే సాధ్యం
Published Thu, Jun 1 2017 12:57 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
Advertisement
Advertisement