పదో తరగతి పరీక్షల్లో ఇంగ్లిష్ మీడియం విద్యార్థులు అధిక ఉత్తీర్ణత సాధించారు.
సాక్షి, హైదరాబాద్: పదో తరగతి పరీక్షల్లో ఇంగ్లిష్ మీడియం విద్యార్థులు అధిక ఉత్తీర్ణత సాధించారు. పరీక్షలు రాసిన మొత్తం విద్యార్థుల సగటుతో పోల్చితే ఇంగ్లిష్ మీడియంలో ఉత్తీర్ణులైన వారి శాతం ఎక్కువగా ఉంది. మొత్తం 77.56 శాతం మంది ఉత్తీర్ణులు కాగా అందులో ఇంగ్లిష్ మీడియంలో 82.41 శాతం, తెలుగు మీడియంలో 73.32 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులు అయ్యారు. ఇదిలా ఉండగా ఈసారి పదో తరగతి పరీక్షలు రాసిన వారిలో ఇంగ్లిష్ మీడియం విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది.
ప్రైవేటు స్కూళ్లతో పాటు ప్రభుత్వ పాఠశాలలు, గురుకుల విద్యాలయాల్లో ఇంగ్లిష్ మీడియం ఉండటమే ఇందుకు కారణం. గతేడాది తెలుగు మీడియం విద్యార్థులు 2,50,073 మంది పరీక్షలకు హాజరు కాగా 2,08,023 మంది (83.18) ఉత్తీర్ణులయ్యారు. 2,36,998 మంది ఇంగ్లిష్ మీడియం విద్యార్థులు పరీక్షలు రాయగా అందులో 2,11,723 మంది (89.34 శాతం) ఉత్తీర్ణులయ్యారు.
మీడియం హాజరు ఉత్తీర్ణులు శాతం
తెలుగు 2,44,448 1,79,221 73.32
ఇంగ్లిష్ 2,56,363 2,11,281 82.41
ఉర్దూ 11,713 7034 60.05
ఇతర 949 731 77.03
మొత్తం 5,13,473 3,98,267 77.56