నిజామాబాద్ అర్బన్ : సమగ్ర సర్వే విధుల కేటాయింపులలో అ స్పష్టత నెలకొంది. సర్వే కోసం ఉద్యోగులను ఎంపిక చేయడం, వారికి ప్రాంతాలు కేటాయిం చడంలో అధికారులు అయోమయానికి గురవుతున్నారు. ఈ నెల తొమ్మిదిన మొదటిసారిగా ఉద్యోగులందరికీ కుటుంబ సమగ్ర సర్వేపై శిక్ష ణ ఇచ్చారు. రెండవ విడత శిక్షణ ఈ నెల 17న ఉంటుందని, అనంతరం విధులు కేటాయిస్తామని చెప్పారు.
దీంతో ఉద్యోగులందరూ ఆది వారం రెండవ విడత శిక్షణ కార్యక్రమానికి హా జరయ్యారు. నాల్గవ తరగతి ఉద్యోగి నుంచి కా ర్యాలయ పరిపాలన అధికారి వరకు ఇందులో ఉన్నారు. ప్రైవేటు, కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు కూడా పాల్గొన్నారు. సర్వే ఒక్క రోజే ఉండటంతో సిబ్బంది కొరత లేకుండా జిల్లా అధికార యంత్రాంగం ఈ నిర్ణయం తీసుకుంది. కానీ, రెండవ విడత శిక్షణలో గందరగో ళం నెలకొంది. ఉద్యోగులు భారీ సంఖ్యలో రా వడంతో విధుల కేటాయింపులలో అధికారులు విఫలమయ్యారు.
ఉద్యోగులు రాగానే మొదట ఓ రిజిష్టర్‌లో, శిక్షణ ముగిసిన అనంతరం విధులకు హాజరయ్యేందుకు సిద్ధంగా ఉన్నట్లు మరో రిజిస్టర్‌లో సంతకం చేసేందుకు ఏర్పాటు చేశా రు. దీనిపై అవగాహన లేకపోవడంతో చాలా మంది శిక్షణకు హాజరైనట్టు మాత్రమే సంతకం చేశారు. రెండవ సంతకం చేయకపోవడంతో వారంతా గైర్హాజరయ్యారంటూ విధులు కేటాయించలేదు. దీంతో వారు ‘‘మా డ్యూటీ ఎక్క డ’’ అంటూ అధికారుల వెంట పడాల్సిన పరిస్థి తి ఏర్పడింది.
ఇదీ పరిస్థితి
నగరంలోని బాలికల ఐటీఐలో దాదాపు రెండు వందల మంది ఉద్యోగులకు ఎన్యూమరేటర్లు గా శిక్షణనిచ్చారు. ఆర్డర్‌లు అందజేయలేదు. దీంతో వీరంతా ఆందోళన చెందారు. ‘‘ఆర్డర్‌లు ఇస్తాం రమ్మన్నారు. తీరా మీరు గైర్హాజరు అ య్యారు, మెమోలు జారీ చేస్తామంటూ’’ అధికారులు హెచ్చరించారని మరి కొందరు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. రెండు విడతలు గా శిక్షణకు హాజరయిన తమకు మోమోలు ఎలా ఇస్తారని ప్రశ్నించారు.
జిల్లాలోని చాలా మండలాలలో ఇదే పరిస్థితి నెలకొందని సమా చారం. భిక్కనూర్, నందిపేట మండలాలలో, బాన్సువాడ డివిజన్‌లో ఈ పరిస్థితి తీవ్రంగా ఉంది. భిక్కనూర్ మండల అధికారులైతే రాత్రి తొమ్మిది గంటలకు ఎన్యూమరేటర్లకు ఫోన్ చే స్తూ మీకు విధులు కేటాయించామని పేర్కొం టున్నారు. కానీ ఎక్కడ అనేది స్పష్టం చేయడం లేదు. ఫోన్ కోసం వేచి చూడాలని మాత్రం సూచించారు.
దీంతో తమకు అసలు విధులు కేటాయిం చారో లేదో తెలియక, ఎక్కడికి వెళ్లాలి, ఎవరిని కలవాలనే అయోమయంలో పడ్డామని ఉద్యోగులు పేర్కొంటున్నారు. జిల్లా కేంద్రం నుంచి చాలా మంది ఉద్యోగులు 50 కిలో మీటర్ల దూరం వరకు ఉద్యోగాలు చేస్తున్నవారున్నారు. అకస్మాత్తుగా అధికారులు ఫోన్ చేస్తే ఎలా వెళ్లేదని కలవర పడుతున్నారు.
అయోమయం
Published Mon, Aug 18 2014 1:46 AM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM
Advertisement
Advertisement