
పెగడపల్లిలో వచ్చిన ఓటు హక్కు పత్రం
సాక్షి, ధర్మపురి: ఓటర్ల జాబితాలో తప్పులు దొర్లడంతో ఓటర్లు అయోమయంలో పడ్డారు. శాసనసభ ఎన్నికలను ఎన్నికల కమిషన్ పగడ్బందీగా నిర్వహిస్తున్నప్పటికీ అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంతో తప్పులు తప్పులు దొర్లి ఓటు ఎక్కడ వేయాలో తెలియని పరిస్థితి నెలకొంది. ధర్మపురిలో 5వ వార్డులోని హన్మాన్‌వాడలో సుమారు 50 మందికి పైగా ఓటర్లకు ఓటరులిస్టులో తప్పులు దొర్లాయి. ధర్మపురిలో వేయాల్సిన ఓటర్లను పెగడపల్లి మండలం సుద్దపల్లె ప్రచురితం కావడంతో ఓటర్లు ఆందోళన చెందుతున్నారు. మా ఓటు ఎక్కడ వేయాలో తెలియని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రానున్న శాసనసభ ఎన్నికల్లో కీలకమైన ఓటర్ల స్లిప్పుల్లో ఏకంగా మండలమే తారుమారు కావడం అధికారుల తప్పిదమేనని వారు పేర్కొంటున్నారు. అధికారులు అలసత్వంతోనే ఇలా జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నార