సాక్షి, కరీంనగర్: ఎస్‌ఆర్‌ఎస్పీ వరద కాలువ ఎగువ నీటిని వినియోగించుకునేలా ప్రభుత్వం అనుమతిని ఇచ్చిందని ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గతంలో నీళ్ళకోసం పోరాడితే కేసులు పెట్టిన చరిత్ర చుశామన్నారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదని, మండు వేసివిలో కూడా చెరువులు మత్తడి కుతున్నాయన్నారు. ఎస్‌ఆర్‌ఎస్పీ వరద కాలువ చివరి భూములకు నీరు అందే విధంగా ఇరువైపులా చెరువు కుంటలు నింపాలని నిర్ణయంచామని చెప్పారు.
ఎస్‌ఆర్‌ఎస్పీ కాలువ మొత్తాన్ని వెయ్యి కోట్లతో రిపేర్ చేసి 6 వేల క్యూసెక్కుల నీటిని తరలించాలని నిర్ణయించినట్లు చెప్పారు. మిడ్ మానేర్ కింది భాగంలో 77 వేల ఎకరాలకు సాగునీరు అందించేలా కృషి చేస్తున్నామని, మొక్కజోన్న స్థానంలో కంది పంట వేయాలని నిర్ణయించామన్నారు. ఇక కరీంనగర్ సీడ్ బౌల్ ఆఫ్ తెలంగాణగా, రైస్ బౌల్ ఆఫ్ తెలంగాణగా మారబోతుందని మంత్రి పేర్కొన్నారు. (కరోనా: టెస్టులు చేయకుండానే డిశ్చార్జి)
Comments
Please login to add a commentAdd a comment