![Etela Rajender Orders to Health Department on Tests - Sakshi](/styles/webp/s3/article_images/2020/05/15/kmm.jpg.webp?itok=Azq10Y-R)
వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరైన జిల్లా వైద్య,ఆరోగ్యశాఖ అధికారులు
కొత్తగూడెంరూరల్: జిల్లాలోని ప్రతి గ్రామంలో ఇంటింటికీ తిరిగి జలుబు, జ్వరం, దగ్గు, గొంతునొప్పి, నిమోనియా బాధితుల సమాచారం సేకరించి వైద్యాధికారులకు ఇవ్వాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఏఎన్‌ఎంలు, ఆశవర్కర్లను ఆదేశించారు. శుక్రవారం జిల్లా వైద్య సిబ్బందితో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్(వీసీ)లో ఆయన మాట్లాడారు. పీహెచ్‌సీలను సోడియం హైపోక్లోరైట్‌తో ›క్రిమి రహితం చేయాలని సూచించారు. డయాబెటీస్, హృదోగ్ర బాధితులకు ఇంటి వద్దనే మందులు పంపిణీ చేయాలన్నారు. జిల్లాలో వందశాతం క్షయ వ్యాధిని నివారించడంపట్ల వైద్య సిబ్బందిని మంత్రి అభినందించారు. జిల్లాలో ప్రైవేట్ వైద్యులు జ్వరం, దగ్గు, జలుబు, శ్వాస తీసుకోవడంతో ఇబ్బంది పడిన వారి వివరాలు సేకరించి, సంబంధిత పోర్టల్‌లో తప్పని సరిగా నమోదు చేయాలన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి భాస్కర్, జిల్లా ఆసుపత్రుల సమన్వయకర్త జి.రమేష్, ఏఎన్‌ఎంలు, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment