ప్రతి పంచాయతీకీ నెలకు రూ.2లక్షలు | Every Month Govt Gives 2 Lakhs To Grama Panchayatis For It's Development | Sakshi
Sakshi News home page

ప్రతి పంచాయతీకీ నెలకు రూ.2లక్షలు

Published Fri, Sep 20 2019 10:57 AM | Last Updated on Fri, Sep 20 2019 10:57 AM

Every Month Govt Gives 2 Lakhs To Grama Panchayatis For It's Development - Sakshi

ఇట్యాలలో ప్రతిజ్ఞ చేస్తున్న కలెక్టర్, నాయకులు

పల్లెల అభివృద్ధి, పరిశుభ్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామ పంచాయతీకి నెలకు రూ.2లక్షల నిధులు మంజూరు చేస్తుందని కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మం తు తెలిపారు. గురువారం ఆయన దహెగాం మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి 30 రోజుల ప్రణాళిక అమలు తీరును పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు.

సాక్షి, సిర్పూర్‌: పల్లెల్లో అభివృద్ధి, పరిసరాల పరిశుభ్రత కోసం ప్రతి గ్రామ పంచాయతీకి ప్రభుత్వం నెలకు రూ.2 లక్షలు మంజూరు చేస్తుంనది కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతు పే ర్కొన్నారు. దహెగాం మండలంలోని ఇట్యాల, కోత్మీర్, బీబ్రా గ్రామాల్లో గురువారం ఆయన 30 రోజుల కార్యచరణ ప్రణాళిక అమలును పరి శీలించారు. ముందుగా ఇట్యాల ప్రధాన రహదారిపై మొక్కలు నాటారు. గ్రామంలో పలు కాలనీల్లో పర్యటించారు. డ్రెయినేజీలు శుభ్రం చేయించాలని అధికారులను ఆదేశించారు. మురుగు నీరు నిల్వ ఉంటే దోమలు వృద్ధి చెంది జ్వరాలు వచ్చే అవకాశముందన్నారు. అనంతరం నిర్వహించిన గ్రామసభలో మాట్లాడుతూ 30 రోజుల ప్రణాళికలో అధికారులతో పాటు గ్రామస్తులు భాగస్వాములు కావాలని సూచిం చారు. ప్రతి ఇంటికీ ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలన్నారు.

శ్మశానవాటిక, డంపింగ్‌యార్డుల కోసం స్థలాలను గుర్తించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం మండలంలోని కోత్మీర్, బీబ్రా గ్రామాల్లో పర్యటించారు. కోత్మీ ర్‌లో మొక్కలను నాటారు. బీబ్రాలో శ్మశాన వాటిక స్థలాన్ని పరిశీలించారు. పల్లెలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని గ్రామస్తులకు సూచిం చారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్‌ హేమంత్‌కుమార్, ఎంపీపీ కంబగౌని సులోచన, తహసీల్దార్‌ సదా నందం, ఎంపీడీవో సత్యనారాయణ, సర్పంచులు మురారీ, తరనుం సుల్తానా, క్రిష్ణమూర్తి, ఇట్యాల, బీబ్రా ఎంపీటీసీలు భాగ్యలక్ష్మి, శంకర్, పశువైద్యాధికారి పావని, ఈజీఎస్‌ ఏపీవో చంద్రయ్య, ఈవోపీఆర్డీ రాజేశ్వర్‌గౌడ్, రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్‌ సంతో ష్‌గౌడ్, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు ప్రసాద్‌రాజు, నాయకులు సురేష్, సోను తదితరులు పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement