ఓ యువ రైతు ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో జారిపడి మృతిచెందాడు.
వలిగొండ (నల్లగొండ) : ఓ యువ రైతు ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో జారిపడి మృతిచెందాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా వలిగొండ మండల కేంద్రంలో మంగళవారం సాయంత్రం జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. బత్తిని రాకేష్ (20) పొలంలో వరి నారు వేశాడు. కాగా సాయంత్రం సమయంలో చేతులు శుభ్రపరచుకోవడానికి వ్యవసాయ బావి దగ్గరకు వెళ్లగా కాలు జారి అందులో పడిపోయాడు. ఈత రాకపోవడంతో ప్రాణాలు కోల్పోయాడు.