![Father And Son Both Died In Lighting Strike In Mahabubabad - Sakshi](/styles/webp/s3/article_images/2019/10/16/mdk.jpg.webp?itok=iyCPy2fJ)
సాక్షి, మరిపెడ రూరల్ : పొలంలో పత్తి ఏరుతుండగా ఒక్కసారిగా పడిన పిడుగు తండ్రీ కొడుకుల ప్రాణాలను బలితీసుకుంది. మరొకరు ప్రాణాపాయస్థితి నుంచి బయటపడ్డారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం తానంచెర్ల శివారు వాల్యాతండా గ్రామపంచాయతీ పరిధిలో మంగళవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. తండాకు చెందిన తేజావత్ కిషన్ (48), భార్య తారతో కలిసి వ్యవసాయ క్షేత్రంలో పత్తి ఏరడానికి వెళ్లారు.
ఈ క్రమంలో భార్యాభర్తలిద్దరూ పత్తి ఏరుతుండగా కొడుకు తేజావత్ సంతోష్ (14) మధ్యాహ్న భోజనం తీసుకెళ్లాడు.భోజన విరామం అనంతరం అమ్మానాన్నలతో కలిసి తాను సైతం పత్తి ఏరుతుండగా.. ఆ సమయంలో ఉరుములు మెరుపులతో వాన మొదలైంది. అంతలోనే వారికి అతి సమీపంలో పిడుగు పడటంతో తండ్రీ కొడుకులు కిషన్, సంతోష్ అక్కడికక్కడే మృతి చెందగా.. తార స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment