
సాక్షి, మేడ్చల్: మేడ్చల్ జిల్లా కీసర మండలం అంకిరెడ్డి పల్లి గ్రామంలోని డిజిటల్ ఫ్యాక్టరీలో సోమవారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. సుమారు రూ.10 కోట్ల ఆస్తి నష్టం జరిగి ఉండవచ్చునని భావిస్తున్నారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఐదు ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపు చేస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment