ఎప్పుడు భర్తీ చేస్తారో చెప్పండి: కోదండరాం
Published Wed, Aug 16 2017 4:10 PM | Last Updated on Mon, Jul 29 2019 2:51 PM
ఖమ్మం: ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయో లెక్కలు చెబుతున్నారు గానీ, నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల చేస్తున్నారో చెప్పలేదని ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. భర్తీకి సంబంధించిన క్యాలెండర్ విడుదల చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరుతూ ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఖమ్మం భక్తరామదాసు కళా క్షేత్రంలో బుధవారం ఏర్పాటు చేసిన నిరుద్యోగ సదస్సులో ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడారు. ఈ విషయంలో సర్కారుపై ఒత్తిడి పెంచేందుకు దసరా తర్వాత హైదరాబాద్ లో భారీ ఎత్తున నిరుద్యోగ సదస్సు ఏర్పాటు చేస్తున్నామన్నారు.
Advertisement
Advertisement