ఈటెలను ఫోన్లో పరామర్శించిన గవర్నర్ | Governor condolences to etela rajender car accident | Sakshi
Sakshi News home page

ఈటెలను ఫోన్లో పరామర్శించిన గవర్నర్

Published Sun, Jun 14 2015 9:31 AM | Last Updated on Tue, Aug 14 2018 3:22 PM

ఈటెలను ఫోన్లో పరామర్శించిన గవర్నర్ - Sakshi

ఈటెలను ఫోన్లో పరామర్శించిన గవర్నర్

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ను ఆదివారం గవర్నర్ నరసింహన్, కేంద్రమంత్రి ఎం వెంకయ్యనాయుడు వేర్వేరుగా ఫోన్లో పరామర్శించారు. ఆరోగ్యం పరిస్థితి ఎలా ఉందని వారు ఈటెలను అడిగి తెలుసుకున్నారు. అలాగే ప్రమాదం ఎలా జరిగిందంటూ ఆరా తీశారు. ఈటెల త్వరగా కొలుకోవాలని నరసింహన్, వెంకయ్యలు ఆకాంక్షించారు.

శుక్రవారం కరీంనగర్ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. ఆ క్రమంలో హుజూరాబాద్ నుంచి ఫార్చ్యూనర్ వాహనంలో కరీంనగర్‌కు వెళుతుండగా... శనివారం సాయంత్రం మానకొండూరు సమీపంలో ఆయన ప్రయాణిస్తున్న వాహనం బోల్తా కొట్టింది. ఓ టిప్పర్‌ను ఓవర్‌టేక్ చేయబోతూ దాన్ని తాకడంతో మంత్రి ప్రయాణిస్తున్న కారు పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో మంత్రి రాజేందర్‌కు కాలుకి, ఛాతీ భాగంలో బలమైన గాయాలు అయిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement