గ్రేటర్ బీజేపీలో ఆనందోత్సాహం | Greater BJP anandotsaham | Sakshi
Sakshi News home page

గ్రేటర్ బీజేపీలో ఆనందోత్సాహం

Published Mon, Oct 20 2014 1:00 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM

గ్రేటర్ బీజేపీలో ఆనందోత్సాహం - Sakshi

గ్రేటర్ బీజేపీలో ఆనందోత్సాహం

సాక్షి, సిటీబ్యూరో/అఫ్జల్‌గంజ్:  మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో బీజేపీ విజయ కేతనం ఎగురవేయడంతో నగరంలో ఆ పార్టీ కార్యకర్తల్లో ఆనందం వెల్లివిరిసింది.  ఆదివారం ఉదయం ఫలితాల సరళి తెలియడంతోనే పార్టీ శ్రేణులు బాణసంచా కాల్చి..స్వీట్లు పంచుకున్నారు. రంగులు జల్లుకున్నారు. మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ప్రేమ్‌చంద్ రాథోడ్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఆదివారం ఉదయం బీజేపీ నగర కార్యాలయానికి చేరుకున్నాయి. స్వీట్లు పంచుకున్నారు.  

2019 సార్వత్రిక ఎన్నికల్లో దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ విజయకేతనం ఎగురవేసి ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం ఖాయమని ఆ పార్టీ శాసన సభపక్ష నాయకుడు, ముషీరాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు.  ఈ తాజా గెలుపుతో గ్రేటర్ హైదరాబాద్‌లో కూడా రాజకీయ పునరేకీకరణకు ప్రధాన పక్షంగా బలం సాధించుకొనేందుకు వీలవుతుందని బీజేపీ గ్రేటర్ అధ్యక్షుడు బి.వెంకటరెడ్డి  అభిప్రాయపడ్డారు.

ఈ విజయోత్సవాల్లో బీజేపీ నగర జనరల్ సెక్రటరీ ఉమామహేంద్ర,  సెక్రటరీ రమేష్ యాదవ్, ఉపాధ్యక్షుడు ఎక్కాల నందు, మీడియా ఇన్‌చార్జి సి.మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇక పార్టీ గన్‌ఫౌండ్రి డివిజన్ అధ్యక్షులు పీసీ సుకుమార్ ఆధ్వర్యంలో వందలాది మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. పెద్దఎత్తున బాణాసంచా కాల్చి, ప్రజలకు మిఠాయిలు పంచిపెట్టి సంతోషం వ్యక్తం చేశారు. ర్యాలీలో డివిజన్ బీజేపీ యువమోర్చా అధ్యక్షులు గౌరీశంకర్, ప్రధాన కార్యదర్శి నితిన్ జైస్వాల్ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement