కాళేశ్వరం(మంథని): రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు జోరువానను సైతం లెక్క చేయకుండా ప్రాజెక్టుల బాటపట్టారు. సోమవారం ఆయన ఆకస్మికంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోగల కన్నెపల్లి పంప్‌హౌస్, గ్రావిటీ కాల్వ, అన్నారం బ్యారేజీ పనులు పరిశీలించారు. ఉదయం నుంచి కురుస్తున్న వర్షంలోనే పనులను పర్యవేక్షించారు. పంప్‌హౌస్ లోపలి కింది భాగంలోకి దిగి పనులను పరిశీలించారు. జోరువాన కురుస్తుండటంతో పనులు నిలిచిపోవడాన్ని చూసి మంత్రి అసహనం వ్యక్తం చేశారు. వర్షం కురుస్తున్నా పనులు జరిగేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. జూలైలో నీరందిస్తామని డెడ్‌లైన్ విధించినా అధికారులు, కాంట్రాక్టర్లు పట్టించుకోవడం æలేదని మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment