సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఆర్టీఐ కమిషనర్ల నియామకానికి లైన్ క్లియర్ అయింది. రాష్ట్రంలో పూర్తిస్థాయిలో ఆర్టీఐ కమిషనర్ల నియాకం చేపట్టాలని ప్రభుత్వాన‍్ని హైకోర్టు ఆదేశించింది. ఖాళీగా ఉన్న కమిషనర్ల పోస్టులను ఆగస్టు 31 లోపు భర్తీ చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. కాగా ఆర్టీఐలో ప్రస్తుతం ఒక్క కమిషనరే ఉండటంతో ఎలాంటి సమాచారం తెలుసుకోలేకపోతున్నామని ఆకాష్ కుమార్ అనే విద్యార్థి కోర్టును ఆశ్రయించాడు. ప్రజలకు అందుబాటులో ఉండేలా మరింతమంది కమిషనర్ల నియామకం చేపట్టాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సోమవారం విచారణ జరిపిన హైకోర్టు పూర్తి స్థాయిలో ఆర్టీఐలో కమిషనర్ల నియామకం చేపట్టవచ్చని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment