
‘కల్యాణ లక్ష్మి’కి ‘కల్యాణ లక్ష్మి’కి ఇలా దరఖాస్తు
ఇలా దరఖాస్తు చేసుకోండి..
మైనార్టీ వర్గానికి చెందిన వారైతే.. తెలంగాణ నివాసి అయి ఉండాలి.
అమ్మాయి, అబ్బాయి తల్లి,దండ్రుల వార్షిక ఆదాయం రూ.2 లక్షలకు మించరాదు.
దరఖాస్తుకు సంబంధిత ధ్రువపత్రాలతో పాటు నేరుగా జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ కార్యాలయంలో అందించాలి.
దరఖాస్తుకు కుల, ఆదాయ, జనన, స్థానిక ధ్రువపత్రాలు తప్పనిసరిగా జత చేయాలి.
అధికారులకు ఇచ్చే ధ్రువపత్రాలు ఆరు నెలల లోపు తీసుకున్నవై ఉండాలి.
జత చేయాల్సిన పత్రాలతో పాటుగా వధువు బ్యాంక్ అకౌంట్ పాస్‌బుక్ కాపీని సైతం ఇవ్వాలి.
www.epasswebsite.cgg.gov.in వెబ్‌లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
ధ్రువపత్రాలు స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
ఈ పథకానికి ఇతర పథకాలకు ఎలాంటి సంబంధం లేదు.
ఇప్పటికే కొత్తగా వివాహం అయినవారు అయితే మ్యారేజ్ సర్టిఫికెట్ లేదా, మసీదు నుంచి పొందిన వివాహ ధ్రువీకరణ పత్రంతో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇతరులు ఇలా..
పెళ్లి కాని షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల కుటుంబాలకు మాత్రమే ఇది వర్తిస్తుంది.
ఈ పథకానికి కూడా పైన పేర్కొన్న విధంగానే దరఖాస్తు చేసుకోవాలి.
ఈ విభాగానికి పూర్తిగా ఆన్ లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవాలి.
వీరికి కూడా ప్రభుత్వం రూ. 51000 నగదును బ్యాంక్ ఖాతాలో జమ చేస్తుంది.
పెళ్లి నెల రోజులు ఉందనగా దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తుకు పెళ్లి శుభలేఖ జత చేయాల్సి ఉంటుంది.
నోట్ : ఇటీవ లే ఈ పథకానికి చిన్న మార్పు చేశారు.
వరుడి ‘ఆధార్’ నంబర్ కూడా తప్పకుండా సమర్పించాలి.