
సాక్షి, హైదరాబాద్: ఆగ్నేయాసియా దేశాల సదస్సుకు హైదరాబాద్ వేదిక కానుంది. సోమవారం నుంచి ఏడు రోజుల పాటు జరిగే ఈ సదస్సును గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ రాజ్‌భవన్‌లో ప్రారంభిస్తారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ(ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ) ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో ఆగ్నేయాసియా దేశాలకు చెందిన సివిల్ సర్వెంట్లకు ఈ పేమెంట్లు, ఆర్థిక చేకూర్పు, సామాజిక భద్రత అంశాలపై శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తారు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సీఎఫ్‌ఓ సంజయ్ సక్సేనా, ఆయుష్మాన్ భారత్ సీఈఓ ఇందూభూషణ్, చీఫ్ పోస్టుమాస్టర్ జనరల్ బి.చంద్రశేఖర్ తదితరులు కార్యక్రమంలో పాల్గొననున్నారు.