సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య వివాదంగా మారిన వాహనాల ప్రవేశ పన్ను విషయం తన దృష్టికి రాలేదని గవర్నర్ నరసింహన్ చెప్పారు. రాష్ట్రానికి తిరిగివెళ్లాక దానిపై సమీక్షిస్తానని మీడియాకు చెప్పారు. మంగళవారం సాయంత్రం ఢిల్లీలో ఆయన ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమై ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలపై నివేదికలు అందజేశారు. విభజన చట్టంలో ఇరు రాష్ట్రాలకు సంబంధించిన వివాదాస్పద అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. అంతకు ముందు కేంద్ర హోం శాఖ కార్యదర్శి ఎల్.సి.గోయల్‌తో కూడా నరసింహన్ రెండు గంటల పాటు భేటీ అయ్యారు.