హైదరాబాద్ : కోర్టు అనుమతితో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు వచ్చిన రేవంత్ రెడ్డి ...సాయంత్రం 3 గంటల వరకూ అసెంబ్లీలోనే ఉంటానని అధికారులతో చెప్పినట్లు తెలుస్తోంది. ఓటు హక్కు వినియోగించుకోమని కోర్టు చెప్పిందని ఆయన ఈ సందర్భంగా అన్నట్లు సమాచారం. కాగా ఏసీబీ కోర్టు ఆదేశాల మేరకు త్వరగా ఓటు వేయాలని పోలీసులు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిపై ఒత్తిడి తెచ్చారు. దాంతో రేవంత్ రెడ్డి ఓటు వేయగానే ఆయనను అసెంబ్లీ నుంచి పోలీసులు చంచల్ గూడ జైలుకు తరలించారు. కాగా రేవంత్కు బెయిల్ వస్తుందనే ఆశతో అయిదుగురు తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలు ఓటు వేయకుండా కాలయాపన చేశారు.
మరోవైపు ఏసీబీ కోర్టులో టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి తరపు న్యాయవాదులు సోమవారం బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఓటుకు నోటు వ్యవహారంలో రేవంత్ రెడ్డి నిన్న ఏసీబీకి అడ్డంగా దొరికిపోయిన విషయం తెలిసిందే. ఏసీబీ అధికారులు రేవంత్ రెడ్డిని ఈరోజు ఉదయం న్యాయమూర్తి లక్ష్మీపతి ఎదుట హాజరుపరిచారు. అనంతరం రేవంత్ రెడ్డికి జడ్జి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించారు. కాగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయడానికి రేవంత్ రెడ్డికి న్యాయమూర్తి అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.
'సాయంత్రం వరకూ అసెంబ్లీలోనే ఉంటానని చెప్పినా..'
Published Mon, Jun 1 2015 11:07 AM | Last Updated on Mon, Sep 17 2018 6:08 PM
Advertisement