ఆయనే రేవంత్ రెడ్డి బాస్... | chandrababu name should add as a1 in vote-note case says ambati | Sakshi
Sakshi News home page

ఆయనే రేవంత్ రెడ్డి బాస్...

Published Mon, Jun 1 2015 12:43 PM | Last Updated on Mon, Sep 17 2018 6:08 PM

ఆయనే రేవంత్ రెడ్డి బాస్... - Sakshi

ఆయనే రేవంత్ రెడ్డి బాస్...

హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును A-1గా చేర్చి దర్యాప్తు చేపట్టాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. ఆయన సోమవారం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు.  ఈ వ్యవహారంలో రేవంత్రెడ్డి పాత్రధారి మాత్రమే అని...సూత్రధారి చంద్రబాబేనని అంబటి వ్యాఖ్యానించారు.  చంద్రబాబును A-1గా చేర్చి ఏసీబీ విస్తృతంగా విచారణ చేపట్టాలన్నారు. కేసులు తారుమారు చేయడంలో చంద్రబాబును మించినవారు లేరని, దొంగలముఠా బాసు చంద్రబాబును అరెస్ట్ చేయాలన్నారు.

అధికారం కోసం ఎంత నీచమైన పనులైనా చేసే వ్యక్తి చంద్రబాబు అని, ఆంధ్రాలో దోచుకున్న సొమ్మును తెలంగాణలో పార్టీ కోసం ఖర్చు పెడుతున్నారని అంబటి వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ను అధికారం నుంచి దింపడానికి చంద్రబాబు ఏంచేశాడో అందరికీ తెలుసునన్నారు. చంద్రబాబు చెప్పేవన్నీ శ్రీరంగనీతులని ఆయన ఎద్దేవా చేశారు.  మహానాడులో ఎన్నో నీతి కబుర్లు చెప్పారని, నైతిక విలువలకు ఆయన తిలోదకాలు ఇచ్చారన్నారు.  గెలుపు కోసం చంద్రబాబు ఎంతటి నీచానికైనా పాల్పడాతారన్నారు. చంద్రబాబు సీఎం అయినాసరే అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

రేవంత్ రెడ్డి దొరికిన దొంగ మాత్రమే అని టీడీపీలో దొరకని దొంగలు చాలామంది ఉన్నారని అంబటి అన్నారు. వీడియో ఫుటేజ్ల ప్రకారం రేవంత్ రెడ్డి నోట్ల కట్టలు లెక్కపెట్టేది స్పష్టంగా తెలుస్తోందన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మా బాస్ అన్నారని, ఆ బాస్ చంద్రబాబు నాయుడేనని అంబటి వ్యాఖ్యానించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement