
ఆ టీమ్ లో నేను లేను: శశిధర్ రెడ్డి
హైదరాబాద్: తాను బీజేపీలో చేరుతున్నట్టు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని సనత్ నగర్ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి తెలిపారు. సిద్ధాంతపరంగా తాను సెక్యులర్ వాదినని చెప్పారు. తనది బీజేపీతో సిద్ధాంతరపరమైన ఘర్షణ పడే విధానమన్నారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో అసెంబ్లీ సీట్ల సంఖ్యను పెంచాలన్న పునర్విభజన చట్టాన్ని అమలు చేయడంలో కేంద్రం ఆసక్తిగా లేనట్టుందన్నారు. దీనిపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్టీల అధ్యక్షులు, నాయకులు అప్రమత్తం కావాల్సిన అవసరముందన్నారు. ఈ అంశంపై చర్చించేందుకు ఈనెల 12న అన్ని పార్టీల నేతలతో సమావేశం ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగట్టే కాంగ్రెస్ టీమ్ లో ప్రస్తుతం తానులేనని, టీమ్ లో ఉన్నవారు ఆ పనిచేయాలని శశిధర్ రెడ్డి అన్నారు.