సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయడానికి 27 ల్యాబ్‌లకు ఐసీఎంఆర్ అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఆమోదం తెలుపుతూ రెండు రోజుల క్రితం సవరించిన ఉత్తర్వులు జారీచేసింది. వీటిలో 9 ప్రభుత్వ ల్యాబ్‌లు ఉండగా, 18 ప్రైవేటు ల్యాబ్‌లు ఉన్నాయి. ప్రభుత్వ ల్యాబ్‌లలో ఉచితంగా పరీక్షలు నిర్వహించనుండగా, ప్రైవేటు ల్యాబ్‌లలో మాత్రం ప్రభుత్వం నిర్దేశించిన ఫీజును చెల్లించి పరీక్షలు చేయించుకోవాలి.
ప్రభుత్వ ల్యాబ్‌లు ఇవీ..
► గాంధీ మెడికల్ కాలేజ్, సికింద్రాబాద్
► ఉస్మానియా మెడికల్ కాలేజ్, హైదరాబాద్
► సర్ రోనాల్డ్ రాస్ ఆఫ్ ట్రాపికల్–కమ్యూనికేషన్ డిసీజెస్, హైదరాబాద్
► నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(నిమ్స్), హైదరాబాద్
► ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (ఐపీఎం) హైదరాబాద్
► ఈఎస్‌ఐసీ మెడికల్ కాలేజ్, హైదరాబాద్
► కాకతీయ మెడికల్ కాలేజ్, వరంగల్
► సెంటర్ ఫర్ సెల్యులార్–మాలిక్యులర్ బయాలజీ, హైదరాబాద్
► సెంటర్ ఫర్ డీఎన్‌ఏ ఫింగర్ ప్రింటింగ్– డయా గ్నొస్టిక్స్, హైదరాబాద్.
ప్రైవేటు ల్యాబ్స్ ఇవే..
► జూబ్లీహిల్స్‌లోని అపోలో హాస్పిటల్స్ లేబొరేటరీ సర్వీసెస్
► హిమాయత్‌నగర్‌లోని విజయ డయాగ్నొస్టిక్ సెంటర్
► చర్లపల్లిలోని విమ్టా ల్యాబ్స్
► అపోలో హెల్త్ అండ్ లైఫ్‌స్టైల్ లిమిటెడ్, డయాగ్నొస్టిక్ లేబొరేటరీ బోయినపల్లి
► పంజాగుట్టలోని డాక్టర్ రెమెడీస్ ల్యాబ్స్
► మేడ్చల్‌లోని పాత్ కేర్ ల్యాబ్‌లు
► లింగంపల్లిలోని అమెరికన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పాథాలజీ అండ్ ల్యాబ్ సైన్సెస్
► న్యూ బోయినపల్లిలోని మెడ్సిస్ పాత్లాబ్స్
► సికింద్రాబాద్‌లోని యశోద హాస్పిటల్ ల్యాబ్ మెడిసిన్ విభాగం
► మల్కాజిగిరిలో బయోగ్నోసిస్ టెక్నాలజీస్
► బంజారాహిల్స్‌లో టెనెట్ డయాగ్నొస్టిక్స్
► ఏఐజీ హాస్పిటల్, మైండ్‌స్పేస్, గచ్చిబౌలి
► మాదాపూర్‌లోని మ్యాప్మిజెనోమ్ ఇండియా లిమిటెడ్
► బంజారాహిల్స్‌లోని విరించి హాస్పిటల్
► సికింద్రాబాద్‌లోని కృష్ణా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (కిమ్స్)
► లెప్రా సొసైటీ–బ్లూ పీటర్ పబ్లిక్ హెల్త్ అండ్ రీసెర్చ్ సెంటర్, చర్లపల్లి
► సికింద్రాబాద్‌లోని లూసిడ్ మెడికల్ డయాగ్నొస్టిక్స్
► బంజారాహిల్స్‌లోని స్టార్ హాస్పిటల్
Comments
Please login to add a commentAdd a comment