ఖమ్మం : ఈనెల 19న నిర్వహించే సమగ్ర కుటుంబ సర్వేకు పారితోషికం ఇవ్వాల్సిందేనని జిల్లాలోని ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, అధ్యాపకులు డిమాండ్ చేశారు. లేదంటే సర్వే నిర్వహించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. కుటుంబ సమగ్ర సర్వేకు సరిపడా ప్రభుత్వ ఉద్యోగులు జిల్లాలో లేకపోవడంతో ప్రైవేట్ కళాశాలలు, పాఠశాలలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, అధ్యాపకుల సేవలను వినియోగించుకోవాలని అధికారులు భావించారు.
ఈ నేపథ్యంలో ఖమ్మంలోని మహిళా డిగ్రీ కళాశాలలో గురుఆరం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. సర్వేలో పాల్గొంటే తమకు పారితోషికం ఎంతిస్తారని అధికారులను ఉపాధ్యాయులు, అధ్యాపకులు ఈ సందర్భంగా ప్రశ్నించారు. దీనికి అధికారులు స మాధానమిస్తూ ఎవరికి ఏమీ ఇచ్చేది లేదని, స్వచ్ఛందంగానే సర్వే నిర్వహించాలని చెప్పారు. దీంతో ఆగ్రహించిన పలువురు ఉపాధ్యాయులు, అధ్యాపకులు శిక్షణ బహిష్కరించి బయటకు వచ్చారు.
ఉన్నత చదువులు చదివిని ఉద్యోగాలు రాక ఇబ్బంది పడుతుంటే ప్రభుత్వం వెట్టిచాకిరీ చేయించుకునేందుకు ప్రయత్నిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా స్పందించి సర్వేలో పాల్గొన్న ప్రైవేట్ ఉద్యోగులకు పారితోషికం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బాబు, రవీందర్, నరేష్, శేషురాం తదితరులు పాల్గొన్నారు.
పారితోషికం ఇవ్వకుంటే సర్వే చేయం
Published Fri, Aug 15 2014 2:44 AM | Last Updated on Sat, Sep 2 2017 11:52 AM
Advertisement
Advertisement