
ప్రైవేటు స్కూళ్లలో అంతా డొల్లే!
విద్యా ప్రమాణాలు అంతంతే
తెలుగు మినహా ప్రభుత్వ పాఠ్య పుస్తకాల అవులే లేదు
40 శాతం విద్యార్థులకు చదవడం, రాయుడం రావట్లేదు
25 శాతం విద్యార్థులకు లెక్కలే రావు
గైడ్లు, సొంత సిలబస్ ఇస్తూ విద్యార్థులతో బట్టీ పట్టిస్తున్న వైనం
ప్రైవేటు స్కూళ్లలో విద్యా శాఖ సర్వే ప్రారంభం
తొలిరోజే వెలుగులోకి విస్తుపోయే విషయాలు
హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలల్లో పాటిస్తున్న ప్రమాణాలపై విద్యా శాఖ చేపట్టిన సర్వేలో తొలి రోజే విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి. బుధవారం పేరున్న స్కూళ్లలో అధికారులు పలు అంశాలపై సర్వే నిర్వహించా రు. ఏ ఒక్క పాఠశాలలోనూ విద్యా శాఖ జారీ చేసే ఉత్తర్వులు అవులు కావడం లేదని ఈ సం దర్భంగా బయటపడింది. పాఠ్యపుస్తకాలు మెుదలుకొని పని వేళల వరకు ఇదే పరిస్థితి. ఇక విద్యా బోధనపరంగానూ డొల్లతనం వెల్లడైంది. పదో తరగతిలోనే 25 శాతం విద్యార్థులకు గుణకారం, భాగాహారం రావడం లేదని తేలింది. 40 శాతం వుంది విద్యార్థులకు చదవడం రావట్లేదు. కాగా, స్కూళ్లలో ఒక్క తెలుగు మినహా ప్రభుత్వం ముద్రిస్తున్న వురే పాఠ్య పుస్తకాలను వినియోగించడం లేదని తేలింది. జిల్లాల్లోని డైట్ సంస్థల ప్రిన్సిపాళ్లు, రాష్ట్ర విద్యా పరిశోధ న, శిక్షణ వుండలి అధికారుల నేతృత్వంలోని ప్రత్యేక బృందాలు ఈ సర్వేలో పాల్గొంటున్నాయి. ఈ నెల 22వ తేదీ వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది.
అడుగడుగునా ఉల్లంఘనలే..!
పదో తరగతి విద్యార్థులను కేవలం బట్టీ విధానానికే పరిమితం చేస్తున్నట్లు వెల్లడైంది. జీవో 17 ప్రకారం గైడ్లు వినియోగించవ ద్దనే నిబంధన ఉ న్నా ప్రైవేటు స్కూళ్లు యుథేచ్చగా ఉల్లంఘిస్తున్నా యి. విద్యార్థులను పరీక్షలకు సిద్ధం చేసేందుకు గైడ్లు, స్టడీ మెటీరియుల్ అందజేసి బట్టీని ప్రోత్సహిస్తున్నాయి. పదో తరగతి పరీక్షల్లో కొత్తగా ఇంటర్నల్స్‌కు 20 శాతం వూర్కులు కేటాయిం చిన సంగతి తెలిసిందే. దీని అనుగుణంగా చదవడం, రాయుడం, ఆట, పాటలు, క్రీడలు వంటి సహ పాఠ్యాంశాలకు సంబంధించిన వుూల్యాం కనమే జరగడం లేదు. విద్యా సంవత్సరంలో వీటిపై నాలుగుసార్లు వుూల్యాంకనం చేసి వూ ర్కులు వేయూల్సి ఉంది. కానీ ఇంతవరకు ఒక్కసారి కూడా దీన్ని చేపట్టలేదు. ఏ పాఠశాలలోనూ విద్యా హక్కు చట్టం ప్రకారం అవులు చేయూల్సిన సవుగ్ర నిరంతర వుూల్యాంక నం అవులుకే నోచుకోవడం లేదు. అసలు సహ పాఠ్యాంశాల అవులునే పట్టించుకోవడం లేదు.
ఇక త్రైవూసిక పరీక్షలను విద్యా శాఖ ఆదేశాల ప్రకారం వచ్చే నెల 13 నుంచి నిర్వహించాల్సి ఉంది. కానీ ఇప్పుడే ఆ పరీక్షలను నిర్వహిస్తున్నారు. ప్రాథమిక పాఠశాల స్థాయిలోనైతే ఇష్టారాజ్యంగా సొంత సిలబస్, సొంతంగా వుుద్రించిన పాఠ్య పుస్తకాలతోనే బోధన కొనసాగిస్తున్నాయి. ఇన్ని ఉల్లంఘనలు జరుగుతున్నా అధికారులు తనిఖీలు చేసి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. కొన్ని స్కూళ్లలో తనిఖీలు చేసినా వుుడుపులు పుచ్చుకొని చర్యలు చేపట్టకుండా మిన్నకుండిపోరుునట్లు ఆరోపణలు వస్తున్నాయి.