నేటి నుంచి పాతబస్తీలో బోనాల సంబరాలు | In this celebration of the Old City | Sakshi
Sakshi News home page

నేటి నుంచి పాతబస్తీలో బోనాల సంబరాలు

Published Fri, Jul 11 2014 1:26 AM | Last Updated on Sat, Sep 2 2017 10:06 AM

నేటి నుంచి పాతబస్తీలో బోనాల సంబరాలు

నేటి నుంచి పాతబస్తీలో బోనాల సంబరాలు

చార్మినార్: పాతబస్తీలో శుక్రవారం నుంచి బోనాల సంబరాలు ప్రారంభం కానున్నాయి. కలశస్థాపన, ద్వజారోహణం, అంకురార్పణ తో బోనాల ఉత్సవాలు మొదలవుతాయి. లాల్‌దర్వాజా సింహావాహిణి దేవాలయం, మీరాలంమండి మహంకాళి దేవాలయం, అక్కన్న మాదన్న మహంకాళి దేవాలయం, బేలా ముత్యాలమ్మ దేవాలయం, సుల్తాన్‌షాహి జగదాంబ దేవాలయం, ఉప్పుగూడ మహంకాళి తదితర దేవాలయాల్లో ఈ ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు.

ఇందుకు సంబంధించి నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 13వ తేదీన పాతబస్తీలోని వివిధ అమ్మవారి దేవాలయాల ఘటస్థాపన ఊరేగింపు కొనసాగుతుంది. 20వ తేదీన బోనాల సమర్పణ, 21వ తేదీన అమ్మవారి ఘటాల సామూహిక ఊరేగింపు పెద్ద ఎత్తున జరుగుతాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement