మూడేళ్లలో నిరంతర విద్యుత్
మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి
బాన్సువాడ : మరో మూడేళ్లలో రాష్ట్రంలో 24 గంట లపాటు నిరంతరాయంగా విద్యుత్ అందించేందుకు కసరత్తు చేస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. తెలంగాణ విశ్వ బ్రాహ్మణ సంఘం జిల్లా ద్వితీయ వార్షికోత్సవం శుక్రవారం స్థానిక మీనా గార్డెన్స్‌లో జరిగింది. ముఖ్య అతిథిగా మంత్రి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. 2018 చివరి నాటికి 500 కోట్ల రూపాయల వ్యయంతో 24,475 మెగావాట్ల విద్యుత్తును సిద్ధం చేస్తామని అన్నారు. ఆ తర్వాత రాష్ట్రంలో విద్యుత్తు కోతే ఉండదని, గృహ.. వ్యవసాయ విద్యుత్తు పుష్కలం గా సరఫరా అవుతుందని అన్నారు. కేజీ టు పీజీ నిర్బంధ విద్యను వచ్చే విద్యాసంవత్సరం నుంచి అమలు చేస్తామన్నారు.
విశ్వ బ్రాహ్మణుల అభివృద్ధికి కృషి
విశ్వ బ్రాహ్మణులకు సంబంధించిన 18 డిమాండ్లను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ముఖ్యం గా ప్రత్యేకంగా టెండర్ల కేటాయింపు, పోలీసులు.. అటవీ శాఖ అధికారుల వేధింపుల నివారణ డిమాం డ్లను పుష్కరాల తరువాత పరిష్కరిస్తానని అన్నారు. జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే కూడా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యురాలు జంగం విజయ, సర్పంచ్ దోన్కంటి వాణి విఠ ల్, పీఏసీఎస్ చైర్మన్ ఎర్వల కృష్ణారెడ్డి, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు నార్ల సురేష్, విశ్వ బ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షుడు నరహరి చారి, ప్రధాన కార్యదర్శి రామ్మోహన్‌చారి, కోశాధికారి బాలవీర చారి, మండల అధ్యక్షుడు పుండరీకం చారి, ప్రధాన కార్యదర్శి బి.సత్యనారాయణ చారి, సభ్యులు అంజ య్య చారి, రామాచారి, గంగాధర చారి తది తరులు పాల్గొన్నారు.