రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదయ్యారుు. ఆకాశం మేఘావృతమై ఉండ టంతో ఈ పరిస్థితి తలెత్తింది.
సాధారణం కంటే 2 నుంచి 6 డిగ్రీలు అధికం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదయ్యాయి. ఆకాశం మేఘావృతమై ఉండ టంతో ఈ పరిస్థితి తలెత్తింది. గత 24 గంటల్లో రాష్ట్రంలో పగలు, రాత్రి ఉష్ణో గ్రతలు సాధారణం కంటే రెండు నుంచి ఆరు డిగ్రీల వరకు అధికంగా నమోద య్యాయని వాతావరణ అధికారులు తెలి పారు. భద్రాచలం, రామగుండంలలో సాధారణం కంటే ఆరు డిగ్రీలు అధికంగా కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డు కాగా, ఈ రెండు చోట్ల 23, 21 డిగ్రీల సెల్సియస్ చొప్పున కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యారుు. హైద రాబాద్, మెదక్, నిజామాబాద్‌లలో కనిష్ట ఉష్ణోగ్రతలు 5 డిగ్రీల చొప్పున అధికంగా నమోదయ్యాయి. హన్మకొండ, నల్లగొండ ల్లో 4 డిగ్రీల చొప్పున కనిష్ట ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యారుు.
హకీంపేట్, ఖమ్మం, మహబూబ్‌నగర్‌లలో 3 డిగ్రీల చొప్పున రాత్రి ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యాయి. మరోవైపు భద్రాచలం, హకీంపేట్, ఖమ్మం, హన్మకొండ, మహబూబ్‌నగర్, మెదక్, నల్లగొండల్లో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఒకటి నుంచి నాలుగు డిగ్రీలు అధికంగా నమోదయ్యారుు. ఖమ్మంలో 4 డిగ్రీలు అధికంగా.. 33 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మహబూబ్‌నగర్‌లో 3 డిగ్రీలు అధికంగా 33 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇదిలావుండగా గంటల్లో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం సోమవారం నాటికి వాయుగుండంగా మారనుందని వాతావరణ విభాగం తెలిపింది. అరుుతే దీని ప్రభావం తెలంగాణపై పెద్దగా ఉండదని... కేవలం ఆకాశం మేఘావృతమై ఉంటుందని వాతావరణ అధికారులు తెలిపారు. ఫలితంగా రాష్ట్రంలో కాస్తంత ఉష్ణోగ్రతలు పెరగనున్నారుు.