ఎల్‌ఎండీ, మిడ్‌మానేరు కట్టిందెవరూ? | Jeevan Reddy Fire on MP Vinod Kumar | Sakshi
Sakshi News home page

ఎల్‌ఎండీ, మిడ్‌మానేరు కట్టిందెవరూ?

Published Tue, Aug 8 2017 3:54 AM | Last Updated on Thu, Aug 9 2018 8:51 PM

ఎల్‌ఎండీ, మిడ్‌మానేరు కట్టిందెవరూ? - Sakshi

ఎల్‌ఎండీ, మిడ్‌మానేరు కట్టిందెవరూ?

ఎంపీ వినోద్‌కుమార్‌పై జీవన్‌రెడ్డి ఫైర్‌
 
సాక్షి, జగిత్యాల: కరీంనగర్‌ ఎంపీ బి. వినోద్‌కుమార్‌పై సీఎల్పీ ఉపనేత తాటిపర్తి జీవన్‌రెడ్డి ధ్వజమెత్తారు. ‘గత ప్రభుత్వాల నిర్లక్ష్యంతో రూ. కోట్లు వృథా అయ్యాయని.. ఇలా చేస్తే ఇతర దేశాల్లో ఉరి తీసేవారని.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో రైతులకు సాగు నీరందుతుందంటూ’ఎంపీ కవితతో కలసి ఆదివారం వినోద్‌కుమార్‌ చేసిన వ్యాఖ్యలపై జీవన్‌రెడ్డి స్పందించారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ‘ఎల్‌ఎండీ, మిడ్‌మానేరు ఎవరి హయాంలో పూర్తయ్యాయి? 2004–09 వరకు వైఎస్‌ హయాంలో వరద కాలువ ప్రవహించింది నిజం కాదా?

మిడ్‌మానేరు ప్రాజెక్టు పూర్తయి మూడేళ్లు గడుస్తున్నా ఇంతవరకు సాగునీరివ్వని దయనీయ స్థితి మీ ప్రభుత్వానిది కాదా?’ అని ప్రశ్నించారు. శాంతిగా ఉన్న సిరిసిల్ల జిల్లాను అప్రకటిత కల్లోలిత ప్రాంతంగా మార్చింది టీఆర్‌ఎస్సే అన్నారు. ప్రచార్భాటాలకే పరిమితమైన టీఆర్‌ఎస్‌ నేతలు ఎన్ని విశ్వప్రయత్నాలు చేసినా.. జగిత్యాలలో మాత్రం మాయ చేయలేరని స్పష్టంచేశారు. ప్రచారార్భాటాలకే పరిమితమైన టీఆర్‌ఎస్‌ నేతలు ఎన్ని విశ్వప్రయత్నాలు చేసిన జగిత్యాలలో మాత్రం మాయ చేయలేరని స్పష్టం చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement