టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి
సంగారెడ్డి క్రైం : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ హయాంలో జర్నలిస్టులకు మంచి రోజులు వచ్చాయని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (టీయూడబ్ల్యూజే) జిల్లా అధ్యక్షుడు ఎ.విష్ణువర్దన్‌రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రెస్ అకాడమీతో శనివారం జరిపిన సమావేశంలో జర్నలిస్టులకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకోవడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యంగా జర్నలిస్టులందరికీ హెల్త్ కార్డులు, అక్రెడిటేషన్లు ఇచ్చేందుకు సీఎం ఆమోదం తెలుపడం సంతోషకరమన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు ప్రతినెల 3వ తేదీ లోగా రూ.5వేల భృతిని అందజేస్తామని సీఎం ప్రకటించడం నిజంగా ఆయా కుటుంబాల్లో వెలుగులు నింపడమేనన్నారు. జర్నలిస్టులకు నియోజవకర్గ కేంద్రాల్లో 200 గజాల ఇంటి స్థలాన్ని ఇవ్వడం కోసం కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేస్తామని చెప్పిన సీఎం ప్రకటనను స్వాగతిస్తున్నామన్నారు. జర్నలిస్టులందరికీ వారం రోజుల్లోగా హెల్త్ కార్డులు, అక్రెడిటేషన్లు మంజూరు చేసేందుకు విధి విధానాలు రూపొందించాలని సీఎం చేసిన ప్రకటన మేరకు జిల్లాలోని అన్ని మండలాల్లో పనిచేస్తున్న జర్నలిస్టుల వివరాలనుటీయూడబ్ల్యూజే సేకరిస్తుందని విష్ణువర్దన్‌రెడ్డి తెలిపారు. విధి విధానాల రూపకల్పన కోసం ఏర్పాటు చేసిన కమిటీకి తాము జాబితాను వెంటనే అందజేస్తామన్నారు. కాగాముఖ్యమంత్రి నిర్ణయాన్ని హర్షిస్తూ జిల్లా వ్యాప్తంగా ఆదివారం జర్నలిస్టులు సంబరాలు జరుపుకోవాలని విష్ణువర్ధన్‌రెడ్డి కోరారు.
జర్నలిస్టులకు మంచి రోజులు
Published Sun, Feb 22 2015 4:34 AM | Last Updated on Wed, Aug 15 2018 8:58 PM
Advertisement
Advertisement