కటకటాల్లోకి ‘కళ్యాణలక్ష్మి’ అక్రమార్కులు
► ఏడుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు
► పరారీలో మరికొందరు
నర్సింహులపేట : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కళ్యాణలక్ష్మి పథకంలో అవకతవకలకు పాల్పడి, ప్రభు త్వ సొమ్మును దుర్వినియోగం చేసిన ఏడుగురిని మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు తొర్రూరు సీఐ శ్రీధర్‌రావు తెలిపారు. నర్సింహులపేట పీఎస్‌లో మంగళవారం సాయంత్రం కళ్యాణలక్ష్మి పథకంలో అవకతకలకు పాల్పడిన నిందితుల వివరాలను ఆయన వెల్లడించారు. 2014 అక్టోబర్ 2వ తేదీ తర్వాత వివాహ మైన ఎస్సీ, ఎస్టీ నిరుపేద యువతులకు కళ్యాణలక్ష్మి పథకం వర్తిస్తుంది. అయితే కొందరు 2014 అక్టోబర్ కంటే ముందుగానే వివాహం చేసుకొని తప్పుడు సర్టిఫికెట్లు సృష్టించి రూ.51 వేలు స్వాహా చేశారు. ఇలా కొమ్ములవంచకు చెందిన రెండు జంట లు, కౌంసల్యదేవిపల్లిలో ఒక జంటతోపాటు తప్పుడు సర్టిఫికెట్లు సృష్టించిన వ్యక్తిని అరెస్ట్ చేశారు.
వారిలో కొమ్ములవంచకు చెందిన గుగులోతు జ్యోతి - జాటోత్ సుమన్, జాటోత్ పద్మ - వాంకుడోత్ వీరన్న, కౌంసల్యదేవిపల్లికి చెందిన బూరగుండ్ల ఏలేంద్ర -ఏర్పుల కృష్ణ దంపతులతోపాటు నర్సింహులపేటలో ఫొటో స్టూడియో నిర్వహిస్తూ నకిలీ సర్టిఫికెట్లు తయారు చేసి న జాటోతు సంతోష్ ఉన్నారు. అలాగే కళ్యాణలక్ష్మికి దరఖాస్తు చేసుకున్న వారికి పెళ్లి ఇటీవల అయ్యిందా ? అంతకు ముందే అయ్యిందా అనే విషయాన్ని ఇంటికి వెళ్లి పరిశీలించి సర్టిఫికెట్లపై సంతకం చేయాల్సి ఉండ గా వీఆర్‌ఓ యాకయ్య, హెచ్‌డబ్ల్యూఓ సుమన్, ఏటీడబ్ల్యూఓ రమాదేవి అలా వెళ్లకుండానే వారిని చూడకుండానే సంతకం చేసి పంపినందుకు వారిపై కూడా కేసు నమోదు చేశామన్నారు.
ఈ ముగ్గురు అధికారులు పరారీలో ఉన్నారని తెలిపారు. స్టూడియో నడుపుతున్న సంతోష్ నుంచి 2 మానిటర్లు, 2 ప్రింటర్లు, 2 సీపీయూలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇంకా కళ్యాణ లక్ష్మి పథకంపై విచారణ జరుగుతోందని, ఇం దులో నిందుతులు ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని సీఐ వెల్లడించారు. సమావేశంలో ఎస్సై ఎల్లావుల వెంకటప్రసాద్, హెచ్‌సీలు రవీందర్, వెంకటేశ్వర్లు, పీసీలు సాగర్, శివ, కృష్ణమోహన్, శేఖర్, బుచ్చిరాజు, హెచ్‌జీ నహీంపాషా తదితరులు పాల్గొన్నారు.