వాస్తవాలనే ప్రచురించా: కంచ ఐలయ్య
ఆర్యవైశ్యులకు ఆగ్రహం తెప్పించిన సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు పుసక్తంపై కంచ ఐలయ్య పెదవి..
సాక్షి, హైదరాబాద్: తాను ఎవరినీ కించపరచలేదని, వాస్తవాలను మాత్రమే పేర్కొన్నానని ప్రముఖ రచయిత, ప్రొఫెసర్ కంచ ఐలయ్య చెబుతున్నారు. ఆయన రాసిన సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు అనే నవలపై తీవ్ర దుమారం రేగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తనను చంపుతామని కొందరు బెదిరిస్తున్నారంటూ సోమవారం ఆయన ఓయూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన సాక్షితో మాట్లాడారు.
తాను పుసక్తంలో చేసిన వ్యాఖ్యలపై కట్టుబడి ఉంటానన్న ఆయన.. పూర్తి పరిశోధనల తర్వాతే పుసక్తం రాశానని చెప్పుకొచ్చారు. తానెవరినీ కించపరచలేదని.. వాస్తవాలను మాత్రమే ప్రచురించానని ఐలయ్య చెప్పారు. సామాజిక అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకే తాను ఆ పుసక్తం రాశానని ప్రొఫెసర్ కంచ ఐలయ్య స్పష్టం చేశారు.
కాగా, కంచ ఐలయ్యకు వ్యతిరేకంగా రెండు రాష్ట్రాల్లో ఆర్యవైశ్యులు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. తక్షణమే వివాదాస్పద పుస్తకాన్ని నిషేధించిన, న్యాయపరంగా ఐలయ్యపై చర్యలు తీసుకోవాలంటూ ఆర్యవైశ్య సంఘ నేతలు డిమాండ్ చేస్తున్నారు.