
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ మంత్రి కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ సమాజానికి చిరస్మరణీయుడని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. ఈనెల 27న (బుధవారం) కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని పురస్కరించుకుని కేసీఆర్ ఆయనను స్మరించుకున్నారు. స్వరాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణ అన్ని రంగాల్లో ముందడుగు వేయాలని.. కొండా లక్ష్మణ్ బాపూజీకి మనం అందించే నిజమైన నివాళి అదేనని చెప్పారు. తమ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తున్నదని పేర్కొన్నారు.