కేసీఆర్ ఓ మాయల ఫకీరు: ఎర్రబెల్లి | kcr is a joker, criticizes yerrabelli | Sakshi
Sakshi News home page

కేసీఆర్ ఓ మాయల ఫకీరు: ఎర్రబెల్లి

Published Mon, Feb 23 2015 6:56 PM | Last Updated on Tue, Sep 18 2018 8:38 PM

కేసీఆర్ ఓ మాయల ఫకీరు: ఎర్రబెల్లి - Sakshi

కేసీఆర్ ఓ మాయల ఫకీరు: ఎర్రబెల్లి

మానకొండూర్: సీఎం కేసీఆర్ ఓ మాయల ఫకీరని, ఆయన మాటలు తుపాకీరాముడి మాటలను తలపిస్తున్నాయని, ఆయనది తుగ్లక్ పాలన అని టీడీప శాసనసభాపక్ష నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆరోపించారు. సోమవారం కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజకవర్గ పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏపీ సర్కారు విద్యుత్‌ను ఎక్కువగా వినియోగిస్తున్నాయన్న టీఆర్‌ఎస్ నేతల ఆరోపణలు అవాస్తమవన్నారు. ఈ విషయాన్ని అఖిలపక్షం సమావేశంలో నిరూపిస్తే రాజీనామాకైనా  సిద్ధమని సవాల్ చేశారు. ఏపీ సీఎం చంద్రబాబుకు కేసీఆర్ లేఖ రాస్తే తెలంగాణ కు కరెంటు తీసుకురావడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు.

కేసీఆర్ మొద్దునిద్ర కారణంగా తెలంగాణలో విద్యుత్ కొరత ఏర్పడిందన్నారు. కొందరు లఫూట్‌గాళ్లు మాత్రమే టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని, అసలైన కార్యకర్తలు టీడీపీలోనే ఉన్నారని అన్నారు. ప్రభుత్వం చేపడుతున్న పలు కార్యక్రమాల్లో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి, రానున్న రోజుల్లో భారీ కుంభకోణాలు వెలుగుచూసే అవకాశం ఉందన్నారు. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడైనా పర్యటించేందుకు చంద్రబాబుకు హక్కు ఉందన్నారు. ఆయన పర్యటనను అడ్డుకుంటామనడం మూర్ఖత్వమన్నారు. ఇప్పటివరకు తెలంగాణలో సుమారు 800 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే సీఎం, మంత్రులు కనీసం స్పందించడం లేదన్నారు. సమావేశంలో టీటీడీపీ ఉపాధ్యక్షుడు ఇనుగాల పెద్దిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు సిహెచ్. విజయ రమణారావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement