తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు మంగళవారం భూముల క్రమబద్ధీకరణపై సచివాలయంలో అధికారులు సమీక్షా ...
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు మంగళవారం భూముల క్రమబద్ధీకరణపై సచివాలయంలో అధికారులు సమీక్షా సమావేశం నిర్వహించారు. జీవో 58,59లపై హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఆయన ఈ సమీక్ష జరుగుతున్నారు.
కాగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన భూముల క్రమబద్ధీకరణ ప్రక్రియ తామిచ్చే తుది తీర్పునకు లోబడి ఉంటుందని, దీనిని దరఖాస్తుదారులందరికీ పత్రికాముఖంగా తెలియచేయాలన్న తమ ఆదేశాలను ఇప్పటివరకు అమలు కాకపోవటంపై హైకోర్టు సోమవారం ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.