ఖరీఫ్ నాటికి సాగునీరు | Kharif As of irrigated | Sakshi
Sakshi News home page

ఖరీఫ్ నాటికి సాగునీరు

Published Thu, Mar 10 2016 2:28 AM | Last Updated on Sun, Sep 3 2017 7:21 PM

ఖరీఫ్ నాటికి సాగునీరు

ఖరీఫ్ నాటికి సాగునీరు

నాగర్‌కర్నూల్‌రూరల్/పెద్దకొత్తపల్లి : వచ్చే ఖరీఫ్ నాటికి మహాత్మాగాంధీ లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి రైతుల పొలాలకు సాగునీరు అందిస్తామని పరిశ్రమల శాఖా మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బుధవారం నాగర్‌కర్నూల్ మండలం గుడిపల్లి మహాత్మాగాంధీ లిఫ్ట్ ఇరిగేషన్ మూడో లిఫ్ట్ పనులను, పెద్దకొత్తపల్లి మండలంలోని జొన్నలబొగుడ రిజర్వాయర్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ కాంట్రాక్టర్లతో, కేఎల్‌ఐ అధికారులతో మాట్లాడారు. సర్జిఫుల్, పంపుహౌస్ పనులను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. 2017 ఖరీఫ్ నాటికి మహాత్మాగాంధీ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 28, 29, 30 ప్యాకేజీల ద్వారా లక్షా 50వేల ఎకరాలకు నీళ్లందిస్తామన్నారు. మహాత్మాగాంధీ లిఫ్ట్ ఇరిగేషన్‌తోపాటు నెట్టెంపాడు, బీమా, కోయిల్‌సాగర్, తదితర ప్రాజెక్టుల ద్వారా ఖరీఫ్ నాటికి 8 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు.

ఆయన వెంట తెలకపల్లి, పెద్దకొత్తపల్లి జెడ్పీటీసీలు ఈదుల నరేందర్‌రెడ్డి, వెంకటయ్య, మున్సిపల్ కౌన్సిలర్లు సత్యం, ఎంజీఎల్‌ఐ ఎస్‌ఈ భద్రయ్య, సీఈ ఖగేందర్, ఈఈ రాంచందర్, టీఆర్‌ఎస్ నాయకులు జక్కా రఘునందన్‌రెడ్డి, ఈశ్వర్‌రెడ్డి, విష్ణు, గోపాల్‌రావు, రమేష్‌రావు, రాజేందర్‌గౌడ్, సర్పంచ్ నరేందర్, ఎంపీటీసీ నారాయణరావు, లక్ష్మణ్‌రావు,చిన్నయ్య, వెంకటస్వామిగౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement