⇒ 3.71 లక్షల హెక్టార్లలో పంటల సాగు లక్ష్యం
⇒ సాధారణ సాగు కన్నా సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం
⇒ వరిసాగు విస్తీర్ణం 1.40 లక్షల హెక్టార్లు
⇒ పత్తి సాగు విస్తీర్ణం 1.60 లక్షల హెక్టార్లు
⇒ 9.5 లక్షల పత్తి విత్తన ప్యాకెట్లు సిద్ధం!
⇒ వరి, ఇతర పంటల విత్తనాలు రెడీ చేస్తున్న ఏపీ సీడ్స్
⇒ ఎరువుల నిల్వలు పెంచేందుకు కృషి
ఖమ్మం వ్యవసాయం: ఖరీఫ్ కాలం సమీపిస్తుండటంతో వ్యవసాయశాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది(2015-16) కూడా ఖరీఫ్ సాగు విస్తీర్ణం ఉంటుందని వ్యవసాయ శాఖ అంచనాలు రూపొందించింది. జిల్లాలోని ఏడు మండలాలు వీ.ఆర్.పురం, కూనవరం, చింతూరు, కుక్కునూరు, వేలేరుపాడు, బూర్గంపాడుతో పాటు భద్రాచలం పట్టణం మినహా మండలం అంతా రాష్ట్ర విభజనలో ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేయటంతో 41 మండలాల సాగు విస్తీర్ణాన్ని నిర్ధారించింది. ప్రణాళికను రూపొందించింది.
జిల్లాలో ఖరీఫ్ సాధారణ సాగు విస్తీర్ణం 3,48,292 హెక్టార్లు కాగా ఈ ఏడాది 3,71,143 హెక్టార్లలో పంటలు సాగు చేసే అవకాశం ఉందని అంచనాలు రూపొందించారు. గత ఏడాది సాధారణ సాగు విస్తీర్ణం 3,36,047 హెక్టార్లు కాగా 3,71,257 హెక్టార్లలో వివిధ రకాల పంటలు సాగు చేశారు. ప్రధానంగా పత్తిని 1.57 లక్షల హెక్టార్లు, వరి 1.10 లక్షల హెక్టార్లు, దాదాపు లక్ష హెక్టార్లలో మొక్కజొన్న, పెసర, కంది, వేరుశనగ, మినుము, మిర్చి, చెరకు తదితర పంటలను సాగు చేశారు. వర్షాభావ పరిస్థితుల్లో వేసిన పంటల నుంచి దిగుబడులు రైతులు పొందలేక పోయారు. గత ఏడాదితో పోలిస్తే పత్తి, వరి విస్తీర్ణం పెరిగే అవకాశం ఉన్నట్లు వ్యవసాయ శాఖ రూపొందించిన ప్రణాళికలో పేర్కొన్నారు.
పత్తి దాదాపు 1.70 లక్షల హెక్టార్లు, వరి 1.40 హెక్టార్లు, మిగిలిన దాదాపు 60 వేల హెక్టార్లలో మిర్చి, వేరుశనగ, మొక్కజొన్న, పెసర, కంది, చెరకు తదితర పంటలు సాగు చేసే లక్ష్యంగా ప్రణాళికను రూపొందించారు. గత ఏడాది కన్నా వరి, పత్తి సాగు విస్తీర్ణం పెంచాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. జిల్లాలో మొక్కజొన్న సాగు విస్తీర్ణం ఇప్పటికే పెరిగింది. అయితే ఈ ఏడాది ఆ పంట సాగు విస్తీర్ణాన్ని కూడా పెంచాలని వ్యవసాయశాఖ నిర్ణయించింది. వర్షపాతాన్ని బట్టి వచ్చే ఖరీఫ్‌లో పంటల సాగు విస్తీర్ణంలో తేడాలు ఉంటాయని వ్యవసాయ శాఖ భావిస్తోంది. వర్షాలు అనుకూలంగా కురిస్తేనే ప్రణాళికకు అనుగుణంగా పంటలు సాగవుతాయని పేర్కొంటోంది.
విత్తన ప్రణాళిక ...
ఖరీఫ్ ప్రణాళికకు అనుగుణంగా విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచేందుకు వ్యవసాయశాఖ రంగం సిద్ధం చేస్తోంది. అవసరమయ్యే విత్తన వివరాలను వ్యవసాయశాఖ ఖరీఫ్ ప్రణాళికతో పాటు వ్యవసాయశాఖ కమిషనర్‌కు సమర్పించింది. క మిషనర్ వ్యవసాయశాఖ పేర్కొన్న విధంగా విత్తనాలను అందుబాటులో ఉంచాలని తెలంగాణ సీడ్స్ ను ఆదేశించారు. ఈ మేరకు తెలంగాణ సీడ్స్ సంస్థ ఇప్పటికే పలు రకాల విత్తనాలను అం దుబాటులో ఉంచింది. మరికొన్ని విత్తనాలను తెప్పించే పనిలో ఉన్నారు. వివిధ కంపెనీలకు చెందిన పత్తి విత్తనాలను అందుబాటులో ఉంచే విధంగా వ్యవసాయశాఖ కసరత్తు చేస్తోంది. నకిలీ విత్తనాలు మార్కెట్లోకి రాకుం డా చూడాలని అధికారులు నిర్ణరుుంచారు.
ఎరువులు
వచ్చే ఖరీఫ్ కాలానికి 2.23 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం ఉంటాయని వ్యవసాయశాఖ ప్రణాళిక రూపొందించింది. ప్రస్తుతం కేవలం 23,500 మెట్రిక్ టన్నుల ఎరువులు మాత్రమే నిల్వ ఉన్నాయి. అవసరమైన సమయంలో ఎరువుల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. గత ఏడాది యూరియాను బ్లాక్‌లో విక్రరుుంచారు. ఈసారి ఆ పరిస్థితి తలెత్తకుండా చూడాలని భావిస్తున్నారు.
ఖరీఫ్ ప్రణాళిక సిద్ధం
Published Thu, May 7 2015 2:54 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement
Advertisement