నత్త సిగ్గుపడుతోంది
హన్మకొండ : తెలంగాణలో చేపట్టిన ప్రాజెక్టుల పనులు చూస్తే తనకంటే నెమ్మదిగా నడుస్తున్నాయని నత్త సిగ్గుపడుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. పెండింగ్ ప్రాజెక్టు ల పనులు వేగవంతం చేయూలంటూ కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ శాసనసభాపక్ష ఉపనేతలు ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్, చింతల రాంచంద్రారె డ్డి, పలువురు నాయకులు, కార్యకర్తలతో కలిసి గురువారం ఆయన ఏటూరునాగారం కంతనపల్లి నుంచి దేవాదుల ప్రాజెక్టు వరకు మహాపాదయూత్ర చేపట్టారు.
యూత్ర ప్రారంభించే ముం దు కిషన్‌రెడ్డి మాట్లాడారు. వేలాదిమంది ఉ ద్యోగ, యువత, విద్యార్థుల ఆత్మబలిదానాలతో తెచ్చుకున్న తెలంగాణలో కేసీఆర్ కుటుంబం పాలన సాగిస్తూ దోపిడీకి పాల్పడుతోందన్నా రు. 2009లో శంకుస్థాపన చేసిన ప్రాజెక్టుకు 2013లో అన్ని అనుమతులు ఇచ్చినా నేటికి ఒ క్క అడుగు వేయని కంతనపల్లిని చూస్తే కన్నీరు వస్తోందన్నారు. తాను పాదయాత్ర చేపట్టానని తెలుసుకున్న ప్రభుత్వం హడావుడిగా పనులు ప్రారంభించిందన్నారు. తెలంగాణలో కృష్ణా, గోదావరి నీరు వందల కిలోమీటర్ల మేర ప్రవహిస్తోందన్నారు. ఈ నదుల్లో పడవలు నడువాలన్నారు. గోదావరిలో పడవ ప్రయూణానికి బీ జేపీ కృషి చేస్తోందన్నారు.
ఈ విషయూన్ని ఈనె ల 5న జిల్లా పర్యటనకు వస్తున్న కేంద్ర ఉపరి తల రవాణశాఖ మంత్రి నితిన్ గడ్కరీ దృష్టికి తీ సుకెళ్తామన్నారు. రాష్ట్రంలో అనేక ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉన్నప్పటికీ పూర్తి చేయకుండా నూతన ప్రాజెక్టులకు శ్రీకారం చుడతామనడం సరికాదన్నారు. రూ.10 వేల కోట్లు వెచ్చించి 22 లక్షల ఎకరాలకు సాగు నీరు అందే అవకాశం ఉ న్నా ప్రభుత్వం ఈ దిశగా కృషి చేయడంలేదన్నా రు. మెదక్ జిల్లాకు నీటిని తరలించేందుకే దేవాదుల దుర్గం గుట్టకు ఆనకట్ట నిర్మిస్తున్నారని వి మర్శించారు. బీజేపీ మహాపాదయూత్ర చేపట్టగానే పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి కోసం రాష్ట్ర ప్ర భుత్వం హడావుడిగా రూ. 850 కోట్లు మంజూ రు చేసిందన్నారు.
తలాపున గోదావరి ఉన్నా ఏజెన్సీకి చుక్క తాగు, సాగు అందక పోవడం బాధాకరమన్నారు. ఏజెన్సీలోని గిరిజనులు, ద ళితులు, ఇతర ప్రజానికానికి పూర్తిస్థాయిలో న్యాయం జరిగే వరకు వెన్నంటి ఉంటామని కిషన్‌రెడ్డి హామీ ఇచ్చారు. హైదరాబాద్‌లో సచివాలయం తరలిస్తామని, హుస్సేన్‌సాగర్‌లోను మురుగు నీరు తొలగిస్తామని, చెస్ట్ ఆస్పత్రిని తరలిస్తామని చెప్పిన సీఎం కేసీఆర్.. ఇప్పటి వరకు ఎలాంటి చర్య తీ సుకోలేదన్నారు. బీజేపీ పోరాటంతోనే చీప్‌లిక్కర్‌పై ప్రభుత్వం వెనక్కి తగ్గిందన్నారు. తాను ఆంధ్రాకు ఏజెంట్‌ను కాద ని.. తెలంగాణ ప్రజలకు ఏజెంట్‌నని అన్నారు. దేశంలో అత్యధిక మంది గిరిజన, దళిత ఎంపీ లు బీజేపీలోనే ఉన్నారన్నారు.
వ్యవసాయ రం గం అభివృద్ధితోనే ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్నారు. కంతనపల్లి ప్రాజెక్టు నిర్మాణంతో వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నల్లగొండ జిల్లాకు సాగు, తాగు నీటి సమస్య తీరుతుందన్నారు. మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మార్తినేని ధర్మారావు, ప్రధాన కార్యదర్శులు గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, ప్రదీప్‌కుమార్, మంత్రి శ్రీనివాసులు, కార్యదర్శులు కాసం వెంకటేశ్వర్లు, రావు పద్మ, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వర్‌రావు, మహిళా మోర్చా అధ్యక్షురాలు పద్మజారెడృ, జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి, నాయకులు చాడ శ్రీనివాస్‌రెడ్డి, చింతాకుల సునీల్, కావిరి అర్జున్, ఎరుకల రఘు, జన్ను మొగిలి, కుమార్, దీలిప్‌కుమార్, ఉషాకిరణ్, గంగాధర్, అల్లంల రమేష్ తదితరులు పాల్గొన్నారు.