కేసీఆర్‌ పీక పిసికే రోజొస్తుంది: ఎల్‌.రమణ | L.ramana fired on cm kcr | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ పీక పిసికే రోజొస్తుంది: ఎల్‌.రమణ

Published Sat, Mar 11 2017 3:23 AM | Last Updated on Mon, Jul 29 2019 7:38 PM

L.ramana fired on cm kcr

సాక్షి, హైదరాబాద్‌: ధర్నాచౌక్‌ను శివార్లకు తరలించడం అణగారిన వర్గాల పీక పిసికే చర్యేనని.. ఈ నిరంకుశ చర్యను విరమించుకోకపోతే కేసీఆర్‌ పీక పిసికే రోజు వస్తుందని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణ వ్యాఖ్యానించారు. రాజకీయ అంటరానితనాన్ని ప్రోత్సహించే ఇలాంటి చర్యలను మానుకోవాలని.. కేసీఆర్‌ ఖబడ్డార్‌ అంటూ హెచ్చరించారు.

శుక్రవారం జిల్లా టీడీపీ కార్యాలయంలో విలేకరులతో రమణ మాట్లాడుతూ... రాష్ట్రంలో 1983కు ముందు మాదిరిగా కొన్ని కుటుంబాల చేతుల్లోనే గుత్తాధిపత్యం ఉండేలా ప్రస్తుత ప్రభుత్వ విధానాలున్నాయని, వాటిని బద్దలు కొట్టేందుకు టీడీపీ సిద్ధంగా ఉందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement