ఎన్నికల సిత్రాలు | Leaders Campaigning Different Ways | Sakshi
Sakshi News home page

ఎన్నికల సిత్రాలు

Published Mon, Nov 26 2018 6:20 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Leaders Campaigning Different Ways - Sakshi

ముందు కమల రథం.. వెనుక గులాబీ దళం

పెద్దశంకరంపేట(మెదక్‌): తిరుమలాపూర్‌ కాలనీలో ముందు బీజేపీ ప్రచార రథం వెళ్తుండగా దాని వెనకాల టీఆర్‌ఎస్‌ శ్రేణులు ఇంటింటి ప్రచారం చేస్తూ కనిపించారు. స్థానికులు ఈ దృశ్యాన్ని ఆసక్తిగా గమనించారు.

మంచూరియా మంచిగ చేస్తా...!
గెలిపిస్తే అభివృద్ధి చేస్తా..


జోగిపేట(అందోల్‌): అందోలు టీఆర్‌ఎస్‌ అభ్యర్థి క్రాంతికిరణ్‌ ప్రచారంలో భాగంగా జోగిపేటలోని ఓ ఫాస్ట్‌ఫుడ్‌ సెంటెర్‌లో మంచూరియా తయారు చేసి సందడి చేశారు. ఎంపీ బీబీ పాటిల్‌ తయారైన మంచూరియాను ప్లేటులో వేసి కార్యకర్తకు అందించారు. 

దరువేస్తా.. ఓటెయ్యండి

హవేళిఘణాపూర్‌(మెదక్‌): మెదక్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి ఉపేందర్‌ రెడ్డి లింగ్సాన్‌పల్లిలో డప్పు కొట్టి ప్రచారంలో కార్యకర్తలను ఉత్సాహపరిచారు.

కొలిమి నేను పెడతా..
కారుకు ఓటెయ్యి తాతా

కంగ్టి(నారాయణఖేడ్‌): టీఆర్‌ఎస్‌ జిల్లా నాయకురాలు గీతారెడ్డి శుక్రవారం తడ్కల్‌లో కమ్మరి కొలిమి వద్దకు వెళ్లి కొడవలికి కొలిమి పెడుతూ పని చేస్తున్న వడ్రంగిని ఓటు అడిగారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement