కార్పొరేట్‌ కాలేజీల్లో ఆత్మహత్యలపై హైకోర్టుకు లేఖ | Letter to the High Court on suicide in corporate colleges | Sakshi
Sakshi News home page

Published Tue, Jan 23 2018 2:13 AM | Last Updated on Fri, Nov 9 2018 4:51 PM

Letter to the High Court on suicide in corporate colleges - Sakshi

సాక్షి,  హైదరాబాద్‌ : తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేటు కార్పొరేట్‌ కాలేజీలు, ఐఐటీల్లో ఇటీవల జరిగిన విద్యార్థుల ఆత్మహత్యలపై న్యాయ విచారణకు ఆదేశించడంతో పాటు ఆయా కాలేజీల యాజమా న్యాలపై క్రిమినల్‌ కేసులు నమోదు చేసేలా ఆదేశాలు జారీ చేయాలంటూ తమకు అందిన లేఖపై హైకోర్టు స్పందించింది. ప్రకాశం జిల్లాకు చెందిన లోక్‌సత్తా అజిటేషన్‌ సొసైటీ జిల్లా కన్వీనర్‌ దాసరి ఇమ్మాన్యుయేల్‌ రాసిన లేఖను హైకోర్టు ప్రజా ప్రయోజ న వ్యాజ్యం (పిల్‌)గా పరిగణిం చింది.

ఇందులో ఉభయ రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు, హోం, విద్యాశాఖ ల ముఖ్య కార్యదర్శులు, ఇంటర్‌ బోర్డు కార్యదర్శు లు, నిమ్స్, స్విమ్స్‌ డైరెక్టర్లతో పాటు, కార్పొరేషన్‌ కాలేజీలైన నారాయణ, శ్రీచైతన్య కాలేజీల యాజమాన్యాలను ప్రతివాదులుగా చేర్చింది. ఈ పిల్‌పై మంగళవారం ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపే అవకాశం ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement